logo

ప్రకాశ్‌రాజ్‌కు అంబేడ్కర్‌ చుడర్‌ అవార్డు: వీసీకే

ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు 2024 ఏడాదికి అంబేడ్కర్‌ చుడర్‌ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్‌ తెలిపారు.

Published : 30 Apr 2024 01:09 IST

సైదాపేట, న్యూస్‌టుడే: ప్రముఖ నటుడు ప్రకాశ్‌రాజ్‌కు 2024 ఏడాదికి అంబేడ్కర్‌ చుడర్‌ అవార్డు ఇవ్వనున్నట్లు వీసీకే అధ్యక్షుడు తిరుమాళన్‌ తెలిపారు. ఆయన విడుదల ప్రకటనలో.. వీసీకే తరఫున తమిళనాడు, జాతీయస్థాయిలో సమాజసేవ, రాజకీయం, సంస్కృతి, కళా సాహిత్యం తదితర పలు రంగాల్లో నిష్ణాతులకు ఏటా అంబేడ్కర్‌ చుడర్‌,  పెరియార్‌ ఒళి, కామరాజర్‌ కదిర్‌, అయోత్తిదాసర్‌ ఆదవన్‌, ఖాయిదేమిల్లత్‌ పిరై, సెమ్మొళి నాయిరు తదితర అవార్డులను 2007 నుంచి అందిస్తున్నామని పేర్కొన్నారు. అందులో భాగంగా ఈ సంవత్సరానికి అంబేడ్కర్‌ చుడర్‌ అవార్డు ప్రకాశ్‌రాజ్‌కు అందించనున్నట్లు పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని