logo

ముఖ్యమంత్రికి ఘన స్వాగతం

జగనన్న అమ్మఒడి పథకం మూడో విడత నిధులు మంజూరులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 9:45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు.

Published : 28 Jun 2022 06:32 IST


ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డికి పుష్పగుచ్ఛం అందజేస్తున్న మేయర్‌ హరి వెంకటకుమారి

ఎన్‌ఏడీకూడలి, న్యూస్‌టుడే: జగనన్న అమ్మఒడి పథకం మూడో విడత నిధులు మంజూరులో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో చేపట్టిన కార్యక్రమంలో పాల్గొనేందుకు ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి సోమవారం ఉదయం 9:45 గంటలకు ప్రత్యేక విమానంలో విశాఖ అంతర్జాతీయ విమానాశ్రయానికి చేరుకున్నారు. రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు, అధికారులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఉపముఖ్యమంత్రి బూడి ముత్యాలనాయుడు, ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాథ్‌, మేయర్‌ జి.హరివెంకటకుమారి, కలెక్టర్‌ మల్లికార్జున, జెడ్పీ ఛైర్‌పర్సన్‌ జె.సుభద్ర, అనకాపల్లి ఎంపీ బీవీ సత్యవతి, వీఎంఆర్డీఏ ఛైర్‌పర్సన్‌ ఎ.విజయనిర్మల, సీపీ సీహెచ్‌.శ్రీకాంత్‌, ఎమ్మెల్యేలు ముత్తంశెట్టి శ్రీనివాసరావు, కరణం ధర్మశ్రీ, తిప్పల నాగిరెడ్డి, అదీప్‌రాజ్‌, వాసుపల్లి గణేష్‌కుమార్‌, ఎమ్మెల్సీలు వరుదు కల్యాణి, వంశీకృష్ణయాదవ్‌, జీవీఎంసీ కమిషనర్‌ లక్ష్మీశ, జేసీ విశ్వనాథన్‌, అదనపు సీపీ అమిత్‌గార్గ్‌, ఆర్డీవో భాస్కర్‌రెడ్డిలతో పాటు స్థానిక ప్రజా ప్రతినిధులు, ఉన్నతాధికారులు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ప్రత్యేక హెలికాప్టర్‌లో 10:05 గంటలకు శ్రీకాకుళం బయలుదేరి వెళ్లారు. అనంతరం మధ్యాహ్నం 2:10 గంటలకు తిరిగి విశాఖపట్నం విమానాశ్రయానికి చేరుకుని 2:24 గంటలకు ప్రత్యేక విమానంలో విజయవాడ బయలుదేరి వెళ్లారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు