logo

సముద్రంలో యువకుడి గల్లంతు

సముద్రంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి.

Published : 06 Feb 2023 04:45 IST

పెదవాల్తేరు, న్యూస్‌టుడే : సముద్రంలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. దీనికి సంబంధించి మూడో పట్టణ పోలీసులు అందించిన వివరాలు ఇలా ఉన్నాయి. కంచరపాలెంకు చెందిన చిన్నం యువరాజ్‌ (18) ప్రభుత్వ ఐటీఐలో మొదటి సంవత్సరం చదువుతున్నాడు. ఆదివారం కొంతమంది స్నేహితులతో బీచ్‌కు చేరుకున్నాడు. పార్క్‌ హోటల్‌ వెనుక సముద్ర స్నానానికి దిగాడు. పెద్ద అల యువరాజ్‌ను సముద్రం లోనికి నెట్టేసింది. అతన్ని రక్షించే అవకాశం లేకుండాపోయింది. స్నేహితులు మూడో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సి.ఐ. కోరాడ రామారావు ఆధ్వర్యంలో ఎస్‌.ఐ రాము గజ ఈతగాళ్ల ద్వారా గాలింపు చర్యలు చేపడుతున్నారు. రాత్రి 10 గంటల వరకు జాడ తెలియలేదు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని