logo

ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేశారు

పాయకరావుపేటలో ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేసి, ఇంకొక వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారంటూ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు.

Published : 28 Apr 2024 03:52 IST

స్థానికులకు ఉద్యోగాలు ఎక్కడ?
పేట సభలో వైఎస్‌ షర్మిల

ప్రజలకు అభివాదం చేస్తున్న షర్మిల

పాయకరావుపేట, న్యూస్‌టుడే: పాయకరావుపేటలో ఓటమి తప్పదనే ఎమ్మెల్యేను మార్చేసి, ఇంకొక వ్యక్తిని అభ్యర్థిగా తీసుకొచ్చారంటూ పీసీసీ అధ్యక్షురాలు వై.ఎస్‌.షర్మిల విమర్శించారు. పాయకరావుపేటలో శనివారం నిర్వహించిన ఎన్నికల సభలో ఆమె ప్రసంగించారు. ‘చెత్తను తీసుకెళ్లి ఎక్కడో దూరంగా వేస్తారు. మీ ఎమ్మెల్యేపై వ్యతిరేకత ఉందని గుర్తించి, ఓడిపోతాడనే మరొకరిని తీసుకొచ్చారు. మీ ఎమ్మెల్యే ఏనాడైనా పనిచేశారా?, ఎప్పుడైనా మీ దగ్గరకు వచ్చారా?, మరి ఇలాంటి వారి కోసం మనం ఎందుకు ఓట్లు వేయాలి?, ఓటుకు రూ.అయిదు వేలా.. ఎంతిచ్చినా తీసుకోండి.. ఓటు మాత్రం మీ మనస్సాక్షి చెప్పిన వారికి వేయాల’న్నారు. చక్కెర కర్మాగారం మూతపడుతుంటే వాటిని తెరిపించాలనే ఇంగిత జ్ఞానం ఈ ప్రభుత్వానికి లేదన్నారు. చెరకు రైతులు, కార్మికులు రూ. లక్షల్లో నష్టపోతున్నా పట్టించుకునేవారు కనిపించడం లేదన్నారు. దక్కన్‌, హెటిరో పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు ఇవ్వడం లేదన్నారు. అదే ప్రత్యేక హోదా వస్తే నియోజకవర్గానికి 50 నుంచి 100 పరిశ్రమలు వస్తాయని చెప్పారు. పార్లమెంట్‌, పేట అసెంబ్లీ అభ్యర్థులు వెంకటేష్‌, బోని తాతారావులను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో చోడవరం అసెంబ్లీ అభ్యర్థి జగతా శ్రీనివాస్‌, సీపీఐ, సీపీఎం నాయకులు బి.వెంకటరమణ, ఎం.అప్పలరాజు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని