logo

ఎస్‌ఎస్‌టీ బృందాలు అప్రమత్తంగా ఉండాలి

స్టాటిస్టికల్‌ సర్వెలెన్స్‌ బృందాల (ఎస్‌.ఎస్‌.టి.) పనితీరును విశాఖ లోక్‌సభ నియోజకవర్గ కేంద్ర వ్యయ పరిశీలకులు రెంగ రాజన్‌ శనివారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు.

Published : 28 Apr 2024 04:17 IST

తనిఖీల తీరును పరిశీలిస్తున్న వ్యయ పరిశీలకులు రెంగ రాజన్‌

వన్‌టౌన్‌, న్యూస్‌టుడే: స్టాటిస్టికల్‌ సర్వెలెన్స్‌ బృందాల (ఎస్‌.ఎస్‌.టి.) పనితీరును విశాఖ లోక్‌సభ నియోజకవర్గ కేంద్ర వ్యయ పరిశీలకులు రెంగ రాజన్‌ శనివారం ఉదయం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. జిల్లాలో పలు ప్రాంతాల్లో పర్యటించి ఎస్‌ఎస్‌టీ బృందాల తనిఖీలను స్వయంగా చూశారు. విధి నిర్వహణలో అనుసరించాల్సిన విధివిధానాలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. అన్నివేళల్లో అప్రమత్తంగా ఉండాలని, ఈసీ రూపొందించిన రూల్‌ బుక్‌ ప్రకారం చర్యలు తీసుకోవాలని సూచించారు. సాధారణ పౌరుల పట్ల గౌరవప్రదంగా వ్యవహరించాలన్నారు. విశాఖ పార్లమెంట్‌ నియోజకవర్గ పరిధిలో అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. సమన్వయకర్త, పరిశ్రమలశాఖ జేడీ గణపతి పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని