logo

వలసలతో వైకాపా ఖాళీ: అనిత

తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు.

Published : 30 Apr 2024 03:54 IST

గోపాలపట్నంలో తెదేపాలో చేరిన ఎంపీటీసీ సభ్యులు, వార్డు సభ్యులు, గ్రామస్థులు

నక్కపల్లి, ఎస్‌.రాయవరం, పాయకరావుపేట గ్రామీణం న్యూస్‌టుడే: తెదేపాలోకి వలస వస్తున్న వారితో వైకాపా ఖాళీ అవుతోందని కూటమి ‘పేట’ అభ్యర్థి వంగలపూడి అనిత అన్నారు. నక్కపల్లి మండలం చినతీనార్ల, గొడిచెర్ల, ఎన్‌.నర్సాపురం, నెల్లిపూడి గ్రామాల్లో 120, ఎస్‌.రాయవరం మండలంలోని గుర్రాజుపేటకు చెందిన 25 కుటుంబాల వారు వైకాపాను వీడి తెదేపాలో చేరారు. వీకంతా సారిపల్లిపాలెం వద్ద సోమవారం అనిత సమక్షంలో సోమవారం తెదేపాలోకి చేరారు. ఆమె మాట్లాడుతూ వైకాపా అరాచకాలతో ప్రజలతో ఆ పార్టీ నాయకులు కూడా విసిగిపోయారన్నారు. దీంతో తెదేపా, జనసేన, వైకాపా కూటమి ప్రభుత్వం కోసం ఎదురు చూస్తున్నారని చెప్పారు. అనేక గ్రామాల నుంచి వైకాపాను వీడి తెదేపాలోకి చేరుతున్నారన్నారు. కూటమి అధికారంలోకి రాగానే, మేనిఫెస్టో కార్యక్రమాలను అమలు చేయడంతోపాటు, ఉద్యోగావకాశాలు కల్పిస్తామని హామీ ఇచ్చారు. తెదేపా నేతలు కొప్పిశెట్టి వెంకటేష్‌, కురందాసు నూకరాజు, వైబోయిన రమణ, కొప్పిశెట్టి బుజ్జి, వినోద్‌రాజు, దండు అచ్యుతరామరాజు, అమలకంటి అబద్ధం తదితరులు పాల్గొన్నారు.

మాజీ సర్పంచులు, వార్డు సభ్యుల చేరిక

పాయకరావుపేట మండలం గోపాలపట్నం గ్రామంలో ఎంపీటీసీ సభ్యుడు సతీష్‌రాజు ఆధ్వర్యంలో సుమారు 200 మంది వివిధ వర్గాలకు చెందిన వారితోపాటు, మాజీ సర్పంచులు, వార్డు సభ్యులు, మహిళలు తెదేపాలోకి చేరారు. నేతలు డి.గోపినాథ్‌, బాబారాజు, చంటిబాబురాజు, కంకిపాటి వెంకటేశ్వరరావు, వేమూలపూడి అప్పారావు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని