logo

వరంగల్‌ ప్రధాన న్యాయమూర్తిగా నిర్మలాగీతాంబ

వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే.

Published : 30 Apr 2024 03:40 IST

వరంగల్‌ న్యాయవిభాగం, న్యూస్‌టుడే: వరంగల్‌ జిల్లా ప్రధాన న్యాయమూర్తిగా వలగూడం బడిగేలి నిర్మలాగీతాంబ సోమవారం బాధ్యతలు చేపట్టారు. హైదరాబాద్‌లోని సిటీ స్మాల్‌ కాజెస్‌ కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా పనిచేస్తున్న ఈమె బదిలీపై జిల్లాకు వచ్చిన విషయం తెలిసిందే. రెండో అదనపు జిల్లా కోర్టు న్యాయమూర్తి మనిషా శ్రవణ్‌ ఉన్నమ్‌ నుంచి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2007లో అదనపు జిల్లా న్యాయమూర్తిగా ఎంపికైన ఈమె ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలోని చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తికి చెందినవారు. నెల్లూరులో అయిదేళ్ల న్యాయవిద్య, ఉస్మానియా విశ్వవిద్యాలయంలో ఎల్‌ఎల్‌ఎం(లేబర్‌ లాస్‌) పూర్తి చేశారు. వాటిలో బంగారు పతకాలు సాధించారు. హైకోర్టులో 1994 నుంచి 2006 వరకు ప్రాక్టీసు చేశారు. కొంతకాలం ప్రభుత్వ సహాయ న్యాయవాదిగా హైకోర్టులో పనిచేశారు. రాష్ట్రంలోని జిల్లా ప్రధాన న్యాయమూర్తుల్లో ఈమె సీనియర్‌ కావడం గమనార్హం. ఈమె భర్త హైదరాబాద్‌లోని ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్యుడిగా పనిచేస్తున్నారు. బాధ్యతలు చేపట్టిన ఆమెకు జిల్లా న్యాయమూర్తులు, న్యాయవాద సంఘాల బాధ్యులు, పబ్లిక్‌ ప్రాసిక్యూటర్లు, సీనియర్‌ న్యాయవాదులు అభినందనలు తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని