logo

ఆధార్‌ క్లోనింగ్‌తో ఖాతాలో నగదు మాయం

ఆధార్‌ క్లోనింగ్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.30వేలు మాయం చేసినట్లు ఎస్సై హరికృష్ణ శనివారం తెలిపారు.  ఆయన కథనం మేరకు..

Published : 28 Aug 2022 05:59 IST

చింతలపూడి పట్టణం, న్యూస్‌టుడే: ఆధార్‌ క్లోనింగ్‌ ద్వారా గుర్తు తెలియని వ్యక్తులు ఓ వ్యక్తి ఖాతా నుంచి రూ.30వేలు మాయం చేసినట్లు ఎస్సై హరికృష్ణ శనివారం తెలిపారు.  ఆయన కథనం మేరకు.. చింతలపూడి మండలం రాఘవాపురం గ్రామానికి చెందిన మాటూరి నరసింహారావు అనే ఉపాధ్యాయుడు తన చరవాణిలోని ఓ బ్యాంకు యాప్‌ ద్వారా నగదు నిల్వలు పరిశీలించారు. ఆ సమయంలో ఖాతా నుంచి రూ.30 వేలు నగదు తీసినట్లు ఉండటంతో బ్యాంకు అధికారులను సంప్రదించారు. ఆన్‌లైన్లో ఆధార్‌ క్లోనింగ్‌ ద్వారా గుర్తుతెలియని వ్యక్తులు  అపహరించినట్లు చెప్పడంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పేర్కొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని