logo

జగన్‌ అరాచక పాలనపై ఎన్డీయే తరఫున ఛార్జిషీట్‌ వేస్తాం: పితాని

అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్‌ బ్యూరో  సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్‌ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

Published : 28 Apr 2024 04:15 IST

కొమ్ముచిక్కాల (పోడూరు), న్యూస్‌టుడే: అయిదేళ్ల అవినీతి, అరాచక పాలనపై ఎన్టీయే తరఫున ఛార్జిషీట్‌ దాఖలు చేస్తున్నామని కూటమి ఆచంట అసెంబ్లీ అభ్యర్థి, తెదేపా పొలిట్‌ బ్యూరో  సభ్యుడు పితాని సత్యనారాయణ అన్నారు. కొమ్ముచిక్కాలలో శనివారం తెదేపా, జనసేన, భాజపా ముఖ్యనాయకులతో కలిసి జగన్‌ అరాచక పాలన అంతం.. ఎన్టీయే పంతం అని జగనాసురుని రక్తచరిత్ర కరపత్రాలను ఆవిష్కరించి పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జగన్‌ గారడి మాటలకు మోసపోకుండా ఆలోచించి అవినీతి రాజ్యాన్ని అంతమొందించేందుకు ప్రజల సహాయాన్ని కోరుతున్నామన్నారు.  బీసీ, ఎస్సీ, సోదరులు తెదేపా, జనసేన పార్టీలకు చెందితే అక్రమ కేసులు పెట్టడంతోపాటు ప్రాణాలు తీసిన దుర్మార్గుడు జగన్‌ అన్నారు. ఎస్సీ, బీసీల ఉపప్రణాళిక నిధులను మళ్లించి అన్యాయం చేశారన్నారు. స్థానిక ఎమ్మెల్యే శ్రీరంగనాథరాజు డ్వాక్రా సిబ్బందితో మహిళలను బలవంతంగా తీసుకువెళ్లి చీర, సారె ఇచ్చి ఓటు వేయకపోతే నా ఉసురు తగులుతుందని దుర్భాషలాడారని వివరించారు. భాజపా నాయకులు శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్సీ లక్ష్మీనారాయణ, జనసేన మండల అధ్యక్షుడు బాలాజీనాయుడు తదితరులు పాల్గొన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని