logo

ఏటా కొలువులన్నావ్‌.. కన్నీటినే మిగిల్చావ్‌..!

జగన్‌మోహన్‌రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు.

Published : 29 Apr 2024 02:55 IST

వైకాపా మాయమాటలు.. 
కల్లలైన యువ కలలు
తాడేపల్లిగూడెం వన్‌టౌన్‌,న్యూస్‌టుడే

‘‘ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం. ఏపీపీఎస్సీని బలోపేతం చేసి, ప్రణాళిక ప్రకారం ఖాళీలు భర్తీ చేస్తాం. యువతకు బంగారు భవిత అందిస్తాం’’ ఇదీ ఎన్నికలకు ముందు జగన్‌ పలికిన పలుకులు.

గన్‌మోహన్‌రెడ్డి మాయమాటలు నమ్మిన నిరుద్యోగ యువత నిలువునా మోసపోయింది. అయిదేళ్లుగా సర్కారు కొలువుల కోసం వారికి నిరీక్షణ తప్పలేదు. నిరుద్యోగుల కలలను ఆవిరి చేస్తూ..సాగిన వైకాపా పాలన పలు కుటుంబాలను అప్పుల ఊబిలోకి నెట్టేసింది.  ఏటేటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేసి పెద్ద ఎత్తున ఉద్యోగాలు భర్తీ చేస్తానని చెప్పిన జగన్‌ తర్వాత దాని ఊసే విస్మరించారు. ఎన్నికల సమయంలో హడావుడిగా ఉద్యోగ ప్రకటనలు ఇచ్చి, మరోసారి మోసం చేయడానికి తెరలేపారని నిరుద్యోగులు దుయ్యపడుతున్నారు.


ఎదురు చూస్తున్నాం

రాష్ట్రంలో భర్తీ చేసిన ఉద్యోగాల సంఖ్య చాలా తక్కువ. యువత భవితను వైకాపా ప్రభుత్వం విస్మరించింది. దీనిపై తీవ్ర అసంతృప్తిలో యువత ఉంది.

నవీన్‌, మోదుగగుంట


నిర్వీర్యమైన ఐటీ రంగం

ఏటా కొలువులు భర్తీ చేస్తానని అధికారం చేపట్టాక ఇచ్చిన హామీను జగన్‌ తుంగలో తొక్కారు.ఈయన మాటలు నమ్మిన పలువురు యువత శిక్షణ సంస్థల్లో పోటీ పరీక్షలకు తర్ఫీదు పొందారు. దీని కోసం పెద్ద ఎత్తున ఖర్చు పెట్టారు. కనీసం ఐటీ పరిశ్రమను అభివృద్ధి చేసినా కొలువులు దక్కేవి. 

విక్రమ్‌, ఎంసీఏ


ఆశించిన స్థాయిలో కొలువు సాధించలేకపోయా

ఎం.కామ్‌ చదివా. ఆశించిన స్థాయిలో ఉద్యోగం సాధించలేక పోయాను. రాష్ట్రానికి పరిశ్రమలు రావాలి.దీంతో నిరుద్యోగ సమస్య తీరుతుంది. ఇది సమస్య పరిష్కారానికి తొలిమెట్టు. ఉద్యోగాల కోసం నిరుద్యోగులు ఎందరో నిరీక్షిస్తున్నారు. 

బొట్టా త్రినాథ్‌  


పెరిగిన నిరుద్యోగం

ఎంతో నమ్మకంతో జగన్‌ను  గెలిపిస్తే చివరకు యువత ఆశలను సమిధ చేశారు. ఉద్యోగ ప్రకటనలంటూ వంచించారు. కనీసం యువతకు నైపుణ్య శిక్షణ ఇస్తే ఉపాధి అవకాశాలు వచ్చేవి. కొత్త పరిశ్రమలు సైతం రాకపోవడంతో నిరుద్యోగం పెరిగిపోయింది. 

రవికుమార్‌, డిగ్రీ

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని