logo

‘ముందస్తు అరెస్టులు నియంత పాలనకు నిదర్శనం’

సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలను ముందస్తుగా అరెస్టులు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతలా పాలన చేస్తున్నారని ఐకాస నేతలు విమర్శించారు.

Published : 21 Mar 2023 04:07 IST

అఖిలపక్ష నాయకుల నిరసన

అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట నిరసన వ్యక్తం చేస్తున్న అఖిలపక్ష నేతలు

మారుతీనగర్‌, అరవిందనగర్‌ (కడప), న్యూస్‌టుడే : సమస్యలు పరిష్కరించాలని ఆందోళన చేస్తున్న ప్రజా సంఘాలు, అఖిలపక్ష నేతలను ముందస్తుగా అరెస్టులు చేయిస్తూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి నియంతలా పాలన చేస్తున్నారని ఐకాస నేతలు విమర్శించారు. జీవో నంబరు-1 రద్దు చేయాలని కోరుతూ సోమవారం అంబేడ్కర్‌ విగ్రహం ఎదుట ఆందోళన చేపట్టారు. ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్‌రెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, తెదేపా నేత లక్ష్మీరెడ్డి, కాంగ్రెస్‌ నేత సత్తార్‌, సీపీఎం నగర కార్యదర్శి రామ్మోహన్‌రెడ్డి, సీఆర్వీ ప్రసాద్‌, కృష్ణ, దస్తగిరి తదితరులు మాట్లాడుతూ జీవో నంబరు-1 ప్రజాస్వామ్యానికి సంకెళ్లు వేసేలా ఉందన్నారు. ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో జగన్‌మోహన్‌రెడ్డి పాదయాత్రలు, ఓదార్పుయాత్రలు, సభలు, సమావేశాలు నిర్వహించుకున్నారని, అధికారంలోనికి వచ్చాక ప్రతిపక్షాల హక్కులను కాలరాసేలా జీవో నంబరు- 1 తీసుకొచ్చారని విమర్శించారు. అధికార పార్టీ నాయకులు ప్రజల సమస్యలను గాలికి వదిలేసి మైను, వైను, ల్యాండు, శాండు మాఫియాతో యథేచ్ఛగా దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. నిరసనలో వివిధ సంఘాల నేతలు నాగసుబ్బారెడ్డి, ఆంజనేయులు, సుబ్రహ్మణ్యం, బాదుల్లా, వేణుగోపాల్‌, గంగాసురేష్‌, వలరాజు, మునెయ్య, అన్వేష్‌, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, భాగ్యలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని