logo

Nimmala Ramanaidu: పోలవరం ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌ ఉందో లేదో కూడా వైకాపా నేతలకు తెలియదు: నిమ్మల

Eenadu icon
By Andhra Pradesh Dist. Team Published : 21 Apr 2025 16:25 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

రాజమహేంద్రవరం: పోలవరం ప్రాజెక్టు 2027 డిసెంబర్ నాటికి పూర్తి అయ్యేలా పనులు చేస్తున్నామని మంత్రి నిమ్మల రామనాయుడు తెలిపారు. సీఎం చంద్రబాబు లక్ష్యానికి అనుగుణంగా, ఈ ఏడాది డిసెంబర్ చివరినాటికి డయాఫ్రమ్ వాల్ పూర్తి చేస్తామన్నారు. రాజమహేంద్రవరంలో మంత్రి నిమ్మల మీడియాతో మాట్లాడారు. జగన్‌ ఇరిగేషన్‌ శాఖలోనే రూ.18వేల కోట్ల బిల్లులను పెండింగ్‌లో పెట్టి వెళ్లారని, గత ప్రభుత్వం లష్కర్లకు ఏడాది జీతాలు బకాయిలు పెడితే.. కూటమి ప్రభుత్వం చెల్లించిందని చెప్పారు. 

‘‘అసలు ప్రాజెక్టులో డయాఫ్రమ్‌ వాల్‌ ఉందో లేదో కూడా వైకాపా నేతలకు తెలియదు. దానిపై వారికి అవగాహన కూడా లేదు. గతంలో చంద్రబాబు రూ.430 కోట్లతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మిస్తే జగన్‌ విధ్వంసం చేశాడు. రూ.990 కోట్లతో కొత్త డయాఫ్రమ్‌ వాల్‌ పనులు మొదలుపెట్టాం. రెండు కట్టర్లు, రెండు గ్రాబర్లతో డయాఫ్రమ్‌ వాల్‌ నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఏప్రిల్‌ 20 నాటికి 202 మీటర్లకుపైగా వాల్‌ నిర్మాణ పనులు పూర్తి చేశాం. ఏప్రిల్‌ 30 కల్లా మూడో కట్టర్‌ అందుబాటులోకి వస్తుంది. వర్షాకాలంలో సైతం పనులు జరిగేలా, ఎగువ కాపర్‌ డ్యామ్‌ను బలోపేతం చేయడానికి బట్రస్‌ డ్యామ్‌ మే నెలకల్లా పూర్తి చేస్తాం. డయాఫ్రమ్‌ వాల్‌ పూర్తయ్యే వరకు వేచి చూడకుండా.. సమాంతరంగా గ్యాప్‌-1 వద్ద ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ నిర్మాణాన్ని ఏప్రిల్‌లో మొదలుపెట్టాం. గ్యాప్‌-2 వద్ద ఈసీఆర్‌ఎఫ్‌ డ్యామ్‌ పనులు ఈ ఏడాది నవంబర్‌ 30లోగా మొదలుపెట్టేలా సీఎం చంద్రబాబు ప్రణాళికను అమలు చేస్తాం’’అని మంత్రి నిమ్మల తెలిపారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు