logo

Malla reddy: కేసీఆర్‌కు కుమార్తె ముఖ్యం కాదు.. పార్టీ ముఖ్యం: మాజీ మంత్రి మల్లారెడ్డి

Eenadu icon
By Telangana Dist. Team Updated : 03 Sep 2025 14:09 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

కంటోన్మెంట్‌ (సికింద్రాబాద్‌): భారత రాష్ట్ర సమితి (BRS) నుంచి ఎమ్మెల్సీ కవిత (Kavitha) సస్పెన్షన్‌పై ఆ పార్టీ నేత, మాజీ మంత్రి మల్లారెడ్డి (Malla reddy) స్పందించారు. పార్టీని ధిక్కరించిన ఆమెపై వేటు వేయడం సరైన నిర్ణయమేనని చెప్పారు. బోయిన్‌పల్లిలో శ్రీవెంకటేశ్వర లారీ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరిగిన గణనాథుడి ప్రత్యేక పూజా కార్యక్రమంలో మల్లారెడ్డి పాల్గొన్నారు. అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. 

‘‘కేసీఆర్‌కు కుమార్తె, కుమారుడు ముఖ్యం కాదు.. ఆయనకు పార్టీయే ముఖ్యం. దేశవ్యాప్తంగా ఇలాంటి సస్పెన్షన్లు ప్రతి పార్టీలో జరిగాయి. ప్రతి కుటుంబంలో గొడవలు సహజం. తెలంగాణ ప్రజలే కేసీఆర్‌కు ముఖ్యం. తన కుమార్తె, కుమారుడి కోసం పార్టీని ఆయన నాశనం చేసుకోలేరు. కాళేశ్వరంపై తప్పుడు ప్రచారం చేస్తున్నారు. ఈ విషయంలో సీబీఐ మాత్రమే కాదు.. ఎవరూ ఏమీ చేయలేరు. సీబీఐ పేరుతో కేసీఆర్‌ను ఇబ్బంది పెట్టాలనుకోవడం సరికాదు. ఆయనలాంటి గొప్ప వ్యక్తి తెలంగాణ నాయకుడిగా ఉండటం మనందరి అదృష్టం. కాంగ్రెస్ ప్రభుత్వం కాళేశ్వరం అంశంపై ప్రజలను తప్పుదోవ పట్టిస్తూ డ్రామాలు చేస్తోంది’’ అని మల్లారెడ్డి విమర్శించారు.


Tags :
Published : 03 Sep 2025 13:55 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని