logo

Uttam Kumar Reddy: గత ప్రభుత్వాల మాదిరి కాదు.. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం: మంత్రి ఉత్తమ్‌

Eenadu icon
By Telangana Dist. Team Updated : 25 Oct 2024 20:07 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

హైదరాబాద్‌: యుద్ధ ప్రాతిపదికన మెట్రో విస్తరణ పనులు చేపడుతున్నట్లు మంత్రి ఉత్తమ్‌కుమార్‌ రెడ్డి తెలిపారు. తాను హైదరాబాద్‌లోనే పుట్టి పెరిగారని.. హైదరాబాద్‌ను ప్రపంచ స్థాయి నగరాల్లో ఒకటిగా నిలపడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. నరెడ్కో (NAREDCO) ప్రాపర్టీ షోకు మంత్రి ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు.

‘‘తెలంగాణ ప్రగతిలో నరెడ్కో ఒక భాగం. మా ప్రభుత్వం నరెడ్కోకు అండగా ఉంటుంది. గతంలో ఉన్న అనుమతులను మా ప్రభుత్వం రద్దు చేయదు. క్రెడాయ్‌, ట్రెడ్కో, నరెడ్కో కలిసి ఒక కమిటీ ఏర్పాటు చేయండి. నెలకు ఒకసారైనా మీతో మాట్లాడి మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తాం. గతంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఓఆర్‌ఆర్‌ నిర్మించింది. ఇప్పుడు ఆర్‌ఆర్‌ఆర్‌ నిర్మిస్తున్నాం. యుద్ధ ప్రాతిపదికన పనులు చేపడతున్నాం. ప్రపంచ స్థాయి స్కిల్ వర్సిటీ, స్పోర్ట్స్ వర్సిటీ తీసుకొస్తున్నాం. నగరంలో మౌలికసదుపాయాల కల్పన కోసం రూ.10వేల కోట్లు కేటాయించాం. మా ప్రభుత్వం వ్యాపార రంగానికి అండగా ఉంటుంది. మాది ప్రజాస్వామ్య ప్రభుత్వం. గత ప్రభుత్వాల మాదిరి కాదు’’ అని ఉత్తమ్‌ అన్నారు.


Tags :
Published : 25 Oct 2024 15:13 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని