logo

Ponguleti: కులమతాలకు అతీతంగా ఇందిరమ్మ ఇళ్ల కేటాయింపు: మంత్రి పొంగులేటి

Eenadu icon
By Telangana Dist. Team Published : 22 Jun 2025 14:54 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

నకిరేకల్‌: భారాస హయాంలో డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లు ఇస్తామని ఇవ్వలేదని మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి విమర్శించారు. మొదటి విడతలో తమ ప్రభుత్వం 4.50లక్షల ఇళ్లు ఇవ్వాలని నిర్ణయించిందన్నారు. నల్గొండ జిల్లా నకిరేకల్‌లో ఇందిరమ్మ ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ల పట్టాలను మంత్రి పంపిణీ చేశారు. ఈ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు.

‘‘ప్రతి నియోజకవర్గంలో 3,500 ఇళ్లు ఇస్తున్నాం. కులమతాలకు అతీతంగా కేటాయిస్తున్నాం. ఎన్నికల నాటికి పేదలకు 20లక్షల ఇళ్లు కట్టిస్తాం. లబ్ధిదారులకు 4 విడతల్లో రూ.5లక్షలు ఇస్తున్నాం. మధ్యవర్తులకు కాకుండా నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోనే వేస్తాం. న్యాయమైన భూ సమస్యలను ప్రభుత్వం పరిష్కరిస్తుంది’’ అని పొంగులేటి చెప్పారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

సుఖీభవ

చదువు