కార్యకర్తల భుజాలపై విజయచంద్ర ప్రచారం
బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు.
బలిజిపేట: బలిజిపేట మండలంలోని తుమరాడ గ్రామంలో శుక్రవారం ఎన్నికల ప్రచారానికి వచ్చిన తెదేపా అభ్యర్థి బోనెల విజయచంద్రను అక్కడి కార్యకర్తలు, వీరాభిమానులు భుజాలపై కూర్చొనబెట్టుకొని పురవీధుల్లో ఊరేగింపు చేశారు. సైకిల్ గుర్తుపై ఓటు వేసి విజయచంద్రను అత్యధిక ఓట్ల మెజార్టీతో గెలిపించాలంటూ వీరు ఓటర్లను అభ్యర్థించారు. ఏదయ్యా మన గుర్తు సైకిల్, సైకిల్ అంటూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా తుమరాడ గ్రామప్రజలు తెదేపా అభ్యర్థికి ఎక్కడికక్కడ కుంకుమ తిలకాలు దిద్ది హారతులిచ్చారు.
తెదేపాతోనే అభివృద్ధి సాధ్యం
అప్పుల ఊబిలో ఉన్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అభివృద్ధిపథంలోకి తీసుకువచ్చేందుకు చంద్రబాబునాయుడును రానున్న ఎన్నికల్లో ముఖ్యమంత్రిగా గెలిపించేందుకు అందరూ ముందుకు రావాలని తెదేపా పార్వతీపురం అభ్యర్థి బోనెల విజయచంద్ర అన్నారు. తెదేపా, జనసేన, భాజపా నాయకులతో కలసి శుక్రవారం ఆయన బలిజిపేట, వెంగాపురం, తుమరాడ గ్రామాల్లో ఎన్నికల ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వైకాపా పాలన వల్ల రాష్ట్రప్రజలకు కలిగిన నష్టాల గురించి వివరించారు. తెదేపా అధికారంలోకి వస్తేనే సూపర్‌సిక్స్ పథకాల ద్వారా ప్రజలకు లబ్ధి చేకూరనుందన్నారు. కార్యక్రమంలో మండల తెదేపా అధ్యక్షులు పెంకి వేణుగోపాలనాయుడు, అరకు పార్లమెంట్ బీసీ సెల్ అధ్యక్షులు బూరాడ రామ్మోహనరావు, జనసేన రాష్ట్ర ప్రచార కార్యదర్శి పాలూరు బాబు, భాజపా మండల అధ్యక్షులు కేశవనాయుడు, తెదేపా సీనియర్ నాయకులు వి.నారాయణరావు, అక్కేన జగన్మోహనరావు, మరడ రాజు, మండల పెదపాపినాయుడు, భోగ రామారావు, శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
పలువురు తెదేపాలోకి చేరిక...
బలిజిపేట మండలంలోని బర్లి గ్రామానికి చెందిన గుల్లిపల్లి కృష్ణమోహన్ అతనికి చెందిన వంద కుటుంబీకులు వైకాపాను వీడి తెదేపా తీర్థం పుచ్చుకున్నారు. వీరికి విజయచంద్ర తెదేపా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
మూడంచెల భద్రత: ఎస్పీ
[ 02-06-2024]
సార్వత్రిక ఎన్నికలు ముగిశాక జూన్ 4న ఓట్ల లెక్కింపు చేపట్టే జేఎన్టీయూ, లెండీ ఇంజినీరింగ్ కళాశాలల వద్ద ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా మూడంచెల భద్రతను ఏర్పాటు చేశామని ఎస్పీ దీపిక ఎం.పాటిల్ తెలిపారు. -
నీరివ్వలేం.. నిధులివ్వండి
[ 02-06-2024]
ఓ పక్క ఖరీఫ్ సీజన్ ఆసన్నమౌతోంది.. మరోపక్క జలాశయాల పరిధిలోని పంట కాలువలు పూడికలు, పిచ్చి మొక్కలతో అధ్వానంగా ఉన్నాయి.. మరికొన్ని రోజుల్లో పంటలకు సాగు నీరు అందించాల్సి ఉన్నా.. ఇంతవరకు తట్ట మట్టి కూడా తీయలేదు. -
చట్టంలో ఉచితం.. ఫీజులు చెల్లించాలనడం నిజం..!
[ 02-06-2024]
విద్యాహక్కు చట్టం-2009 అనుసరించి 2024-25 విద్యా సంవత్సరానికి ఒకటో తరగతిలో ప్రవేశాలు జరుగుతున్నాయి. -
ఖరీఫ్‌కు జలగండం
[ 02-06-2024]
భానుడి భగభగలతో జిల్లాలోని నీటి వనరులు అడుగంటుతున్నాయి. ఇప్పటికే చెరువులన్నీ ఎండిపోగా.. జలాశయాల పరిస్థితి ఆ దిశగానే సాగుతోంది. -
సంక్షోభ వసతిగృహాలు..!
[ 02-06-2024]
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు ప్రారంభమయ్యాయి. త్వరలో పాఠశాలలు తెరచుకోనున్నాయి. దూర ప్రాంతాల విద్యార్థులు వసతి గృహాల్లో చేరనున్నారు. -
లెక్కింపులో పొరపాట్లు రానివ్వొద్దు
[ 02-06-2024]
ఓట్ల లెక్కింపు ప్రక్రియను నిర్ణీత సమయం ఉదయం 8 గంటలకే ప్రారంభించాలని రిటర్నింగ్ అధికారులను జిల్లా ఎన్నికల అధికారి నాగలక్ష్మి ఆదేశించారు. -
సర్కారుదే పాపం.. పండుటాకులకు శాపం!
[ 02-06-2024]
సంక్షేమానికి పెద్దపీట వేశామని గొప్పలు చెప్పుకొన్న వైకాపా ప్రభుత్వ పెద్దలు సామాజిక పింఛన్ల పంపిణీలో మాత్రం లబ్ధిదారులను ఇబ్బందులకు గురిచేస్తోంది. -
వర్షంతో ఉపశమనం
[ 02-06-2024]
ఎండ వేడిమికి ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజలకు శుక్రవారం అర్ధరాత్రి గంట సమయం పాటు కురిసిన వర్షం ఎంతో ఉపశమనాన్ని కలిగించింది. -
గిరిజన గ్రామాలకు నాణ్యమైన విద్యుత్తు సరఫరా
[ 02-06-2024]
మండలంలోని రాయమానుగూడ, లక్కాయిగూడ, దేవనాపురం కుసిమి తదితర గ్రామాల్లో ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీ తేజ్ ఇమ్మాది శనివారం పర్యటించారు. -
ఎగ్జిట్ పోల్స్‌తో కూటమిలో జోష్
[ 02-06-2024]
రాష్ట్రంలో అధికారం దక్కేదెవరికి.. హోరాహోరీగా సాగిన ఎన్నికల్లో ఫలితంపై 18 రోజులుగా ఆయా పార్టీల నాయకులు, శ్రేణుల్లో నెలకొన్న ఉత్కంఠకు శనివారం విడుదలైన ఎగ్జిట్ పోల్స్ ప్రజామద్దతు ఎవరికో తేల్చేశాయి. -
కీచక హోంగార్డు, స్నేహితుడి అరెస్టు
[ 02-06-2024]
ఇటీవల డెంకాడ మండలం ముంగినాపల్లి గ్రామ సమీపంలో ఒక తోటలో మహిళను అత్యాచారం చేసిన ఘటనలో శ్రీకాకుళం ప్రాంతానికి చెందిన హోంగార్డు రాజ్‌కుమార్‌ను, ఇతడికి సహకరించిన ఎం.తమ్మయ్యను దిశా పోలీసులు శనివారం అదుపులోకి తీసుకొని రిమాండ్‌కు తరలించారు.