Rhisotope Project: కొమ్ముకొమ్ములో విషం.. స్మగ్లర్లకు కషాయం..!

Eenadu icon
By Features Team Updated : 01 Nov 2025 12:20 IST
Ee
Font size
  • ABC MEDIUM
  • ABC LARGE
  • ABC EXTRA LARGE
1 min read

ఇంటర్నెట్‌డెస్క్‌: పర్యావరణ సమతౌల్యాన్ని కాపాడటంలో ముఖ్య భూమిక వహించే ఖడ్గమృగాల సంఖ్య వేటగాళ్ల దాడి, మితిమీరిన మానవ చర్యల కారణంగా వేగంగా తగ్గిపోతున్నాయి. అవి వేటగాళ్ల బారినపడకుండా దక్షిణాఫ్రికా వినూత్న చర్యలు చేపడుతోంది. వాటి కొమ్ముల్లో రేడియో ధార్మికత కలిగిన ఐసోటోప్‌లను ఇంజెక్ట్ చేస్తోంది. దానివల్ల రైనో కొమ్ముల స్మగ్లింగ్‌కు అడ్డుకట్టపడుతోంది (Rrhino poaching).

ఏంటీ రైసోటోప్‌ ప్రాజెక్ట్‌..

అంతర్జాతీయ అణుశక్తి సంస్థ (IAEA) సహకారంతో సౌత్‌ఆఫ్రికన్ యూనివర్సిటీ ఈ రైసోటోప్ ప్రాజెక్ట్ (Rhisotope Project)ను ఆవిష్కరించింది. దీనికింద ఖడ్గమృగాల కొమ్ముల్లోకి స్వల్ప మోతాదులో ఐసోటోప్‌లను ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల కొమ్ము నిరుపయోగంగా మారుతుంది. మానవ వినియోగానికి పనికిరాకుండా విషపూరితం అవుతుంది. అదే సమయంలో రైనోలకు మాత్రం ఎలాంటి హాని కలగదని పరిశోధనల్లో వెల్లడైంది. ఈ కొమ్ములు సరిహద్దులు, నౌకాశ్రయాలు, విమానాశ్రయాలు, కంటైనర్లలో ఉన్నా రేడియేషన్ పోర్టల్ మానిటర్స్ అండ్ స్కానర్స్ వాటిని గుర్తిస్తాయి. ఒకవేళ అవి మార్కెట్‌లోకి వెళ్లిపోయినా రేడియోధార్మికత వల్ల ఎలాంటి ఉపయోగం ఉండదు. ఈ చర్యలతో అక్రమవేట కార్యకలాపాలు తగ్గనున్నాయి. 

ప్రస్తుతం ప్రపంచంలో అయిదు ఖడ్గ మృగం ఉప జాతులున్నాయి. నలుపు, బూడిద రంగువి ఆఫ్రికా ఖండంలో వ్యాపించిఉన్నాయి. ‘గ్రేటర్‌ ఒంటికొమ్ము ఖడ్గమృగం’ భారత్‌, నేపాల్‌, పాకిస్థాన్‌లలో మనుగడ సాగిస్తోంది. సుమత్రా, జావా రకాలు ఇండొనేసియాకే పరిమితమయ్యాయి. ఖడ్గమృగాల కొమ్ముల కోసం వాటిని వధించడం ఎక్కువయింది. చైనా, వియత్నాం, యెమెన్‌లలో వీటి కొమ్ములకు గిరాకీ ఎక్కువగా ఉంది. ఈ కొమ్ములను ఔషధాల తయారీలో వినియోగిస్తుంటారు. కాగా.. ఒకే పరమాణు సంఖ్య, వేర్వేరు ద్రవ్యరాశి సంఖ్యలు ఉన్న ఒకే మూలక పరమాణువులను ఐసోటోప్‌ (Isotopes)లు అంటారు.

Tags :
Published : 01 Nov 2025 12:02 IST

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని