TG News: తెలంగాణలో జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం

తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ విడుదలైంది. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

Updated : 25 May 2024 14:39 IST

హైదరాబాద్‌ : తెలంగాణలో 2024-25 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను అధికారులు విడుదల చేశారు. జూన్‌ 12 నుంచి పాఠశాలలు ప్రారంభం కానున్నాయి. వచ్చే ఏడాది 23 ఏప్రిల్‌ వరకు కొనసాగనున్నాయి.

  • అక్టోబర్‌ 2 నుంచి 14 వరకు దసరా సెలవులు
  • డిసెంబర్‌ 23 నుంచి 27 వరకు 5 రోజుల క్రిస్మస్‌ సెలవులు
  • వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 17 వరకు సంక్రాంతి సెలవులు
  • 28 ఫిబ్రవరి 2025లోపు పదో తరగతి ప్రీ ఫైనల్‌ పరీక్షలు
  • 2025 మార్చిలో పదో తరగతి పరీక్షలు
  • ఉదయం 9.30 నుంచి సాయంత్రం 4.45 గంటల వరకు ఉన్నత పాఠశాలల సమయం
  • అప్పర్‌ ప్రైమరీకి ఉదయం 9 నుంచి సాయంత్రం 4.15 వరకు తరగతులు
Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని