TSRTC: లాజిస్టిక్స్‌ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి రూ.70 కోట్ల ఆదాయం

లాజిస్టిక్స్‌ పార్సిళ్ల డెలివరీ ద్వారా తెలంగాణ ఆర్టీసీకి 2022-23 ఏడాదిలో రూ.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు.

Published : 14 Mar 2024 16:53 IST

హైదరాబాద్‌: లాజిస్టిక్స్‌ సేవల ద్వారా తెలంగాణ ఆర్టీసీకి 2022-23 ఏడాదిలో రూ.70 కోట్ల ఆదాయం వచ్చినట్లు సంస్థ ఎండీ సజ్జనార్‌ వెల్లడించారు. దీనిని 2023-24లో రూ.120 కోట్లకు పెంచాలని లక్ష్యం గా పెట్టుకున్నామని తెలిపారు. దిల్‌సుఖ్‌నగర్‌లో మోడల్‌ లాజిస్టిక్స్‌ పార్సిల్‌ కౌంటర్‌తో పాటు కొత్త లోగో, బ్రోచర్‌ను ఆవిష్కరించారు. రోజూ 15 వేల పార్సిళ్లు టీఎస్‌ఆర్టీసీ ద్వారా అందిస్తున్నామని.. రాబోయే రోజుల్లో ఈ సంఖ్య మరింత పెరుగుతుందని చెప్పారు. గంటల వ్యవధిలో డెలివరీలు చేస్తున్నామని పేర్కొన్నారు. భవిష్యత్‌లో మరిన్ని ఆవిష్కరణతో ప్రజల ముందుకు వస్తామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని