TS News: ఇసుక తవ్వకాలపై గనుల శాఖ కీలక నిర్ణయం

స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది.

Published : 23 Mar 2024 22:01 IST

హైదరాబాద్‌: స్థానికులకు ఇసుక అందుబాటులో ఉండేలా నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలని కలెక్టర్లను ప్రభుత్వం ఆదేశించింది. తమ ప్రాంతాల్లోని ఇసుకను ఇతర ప్రాంతాలకు తరలించకుండా.. అందుబాటులో ఉంచాలని గ్రామీణప్రాంతాల ప్రజల నుంచి విజ్ఞప్తులు అందడంతో కలెక్టర్లకు పరిశ్రమలు, గనులశాఖ ముఖ్య కార్యదర్శి బీఎండీ ఎక్కా ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర ఇసుక మైనింగ్‌ నిబంధనలు -2015 కచ్చితంగా అమలు చేయాలని పేర్కొన్నారు. ఇసుక తవ్వకాలు, రవాణా, స్థానికంగా అందుబాటులో ఉంచడం, ఇళ్ల నిర్మాణ పథకాలకు ఉచితంగా సరఫరా వంటి నిబంధనలు అమలు చేయాలని స్పష్టం చేశారు. ఉల్లంఘనలు జరిగితే అధికారులపై చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని