Anantapur: అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు

అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. 

Published : 27 May 2024 00:07 IST

అనంతపురం: అనంతపురం ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిపై వేటు పడింది. డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేస్తూ అనంతపురం రేంజ్‌ డీఐజీ ఆదేశాలు జారీ చేశారు. తాడిపత్రి అల్లర్ల వేళ అదనపు బలగాలు కావాలని పూర్వ ఎస్పీ అమిత్‌ బర్ధర్‌ కోరగా.. తగిన బలగాలు లేవంటూ లక్ష్మీనారాయణరెడ్డి బాధ్యతారాహిత్యంగా వ్యవహరించారని ఆరోపణలున్నాయి. అదనపు బలగాలు పంపకపోవడంతో అల్లర్లు పెరిగాయని అమిత్‌ బర్ధర్‌ నివేదించారు. ఆయనపై ఈసీ వేటు తర్వాత ఎస్పీగా గౌతమి సాలి బాధ్యతలు చేపట్టారు. తాడిపత్రి ఘటనల వైఫల్యాన్ని లోతుగా పరిశీలిస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ ఏఆర్‌ అదనపు ఎస్పీ లక్ష్మీనారాయణరెడ్డిని పిలిచి గౌతిమి సాలి వివరాలు కోరారు.  ఈసందర్భంగా అదనపు ఎస్పీ పొంతనలేని జవాబులు చెప్పినట్టు సమాచారం. దీంతో ఎస్పీ.. లక్ష్మీనారాయణరెడ్డిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో డీజీపీ కార్యాలయానికి సరెండర్‌ చేసినట్టు తెలుస్తోంది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని