Amaravati: అసెంబ్లీ సమావేశాలకు జగన్‌.. దీక్షా శిబిరం వద్ద రాజధాని రైతుల నిరసన

అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌ వెళుతున్న సమయంలో అమరావతి రైతులు నిరసన తెలిపారు.

Updated : 21 Sep 2023 10:51 IST

అమరావతి: అసెంబ్లీ సమావేశాలకు సీఎం జగన్‌ వెళుతున్న సమయంలో అమరావతి రైతులు నిరసన తెలిపారు. మందడంలోని దీక్షా శిబిరం వద్ద రైతులు, మహిళలు పెద్ద ఎత్తున జెండాలు పట్టుకుని సీఎంకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రాజధానికి భూములు ఇచ్చిన రైతులకు కౌలు చెల్లించడం లేదంటూ ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ పెద్ద ఎత్తున పోలీసులు మోహరించారు. దీక్షా శిబిరం నుంచి రైతులు బయటకు రాకుండా బారికేడ్లు ఏర్పాటు చేశారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని