Amaravati: రాజధాని అమరావతి నమూనా గ్యాలరీని ధ్వంసం చేసిన దుండగులు

రాజధాని అమరావతి (Amaravati)నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. 

Updated : 17 Apr 2024 19:20 IST

తుళ్లూరు: రాజధాని అమరావతి (Amaravati) నమూనా గ్యాలరీని దుండగులు ధ్వంసం చేశారు. గతంలో ఉద్ధండరాయునిపాలెంలో రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశంలో నమూనా గ్యాలరీని ఏర్పాటు చేశారు. ఇది ధ్వంసమైనట్లు స్థానిక రైతులు గుర్తించారు. అమరావతి ముఖచిత్రం, చారిత్రక ఘట్టాలు, మ్యాప్‌లు, కట్టడాలకు సంబంధించిన నమూనాలు, విశేషాలను తెలిపే బోర్డులను గుర్తుతెలియని వ్యక్తులు పగులగొట్టారు. 

వైకాపా ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రాజధాని శంకుస్థాపన జరిగిన ప్రదేశానికి సరైన రక్షణ ఏర్పాటు చేయలేదు. ఆ ప్రాంగణానికి ఉన్న గేట్లనూ అక్రమార్కులు తొలగించి పక్కన పడేశారు. ప్రస్తుతం అక్కడ సెక్యూరిటీ సిబ్బంది కూడా లేరు. రాజధాని ప్రాంతంలో ఇప్పటి వరకు రోడ్లను ధ్వంసం చేసి ఇసుక, కంకర, మట్టి, ఇనుము చోరీ చేసిన దుండగులు.. ఇప్పుడు శంకుస్థాపన ప్రాంతాన్నీ ధ్వంసం చేయడం దారుణమని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని