EC: లోక్‌సభ ఎన్నికల కోసం ఓటర్ల జాబితా సవరణ: ఈసీ

లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.

Updated : 07 Dec 2023 18:43 IST

హైదరాబాద్‌: లోక్‌సభ ఎన్నికల కోసం కేంద్ర ఎన్నికల సంఘం ఓటర్ల జాబితా సవరణ షెడ్యూల్‌ను విడుదల చేసిందని తెలంగాణ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి వికాస్‌రాజ్‌ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. పోలింగ్‌ కేంద్రాల మార్పులు, చేర్పులు, ఓటర్ల ఫొటోల మార్పుల కోసం ఈనెల 20 నుంచి జనవరి 5 వరకు కేంద్రం ఎన్నికల సంఘం అవకాశం కల్పించింది. 2024 జనవరి 6న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి 8న తుది ఓటర్ల జాబితా ప్రకటించనున్నారు. 2024 జనవరి ఒకటో తేదీ వరకు 18 ఏళ్లు నిండిన వారంతా ఓటరుగా నమోదు చేసుకోవాలని ఎన్నికల సంఘం వెల్లడించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు