AP Ministers List: ఏపీ మంత్రుల జాబితా విడుదల.. చోటు దక్కించుకున్న సభ్యులు వీరే..

ఏపీ కొత్త ప్రభుత్వానికి సంబంధించి మంత్రుల జాబితా విడుదలైంది. మంత్రి వర్గంలో జనసేన అధినేత పవన్‌ కల్యాన్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు చోటు దక్కింది. 

Updated : 12 Jun 2024 02:37 IST

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు నేడు ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ ప్రభుత్వంలో మంత్రులుగా బాధ్యతలు చేపట్టనున్న వారి జాబితాను మంగళవారం అర్ధరాత్రి దాటాక విడుదల చేశారు. మొత్తం 24 మందికి ఈ జాబితాలో చోటు దక్కింది. జనసేన నుంచి ముగ్గురికి, భాజపా నుంచి ఒకరికి మంత్రి పదవి లభించింది. చంద్రబాబుతో పాటు 24 మంది మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. జనసేన అధిపతి పవన్‌ కల్యాణ్‌, తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌కు మంత్రివర్గంలో చోటు లభించింది. 

కొత్త మంత్రులు వీరే..

1. పవన్‌ కల్యాణ్‌

2. నారా లోకేశ్‌

3. అచ్చెన్నాయుడు

4. కొల్లు రవీంద్ర

5. నాదెండ్ల మనోహర్‌

6. పి. నారాయణ

7. వంగలపూడి అనిత

8. సత్యకుమార్‌ యాదవ్‌

9. నిమ్మల రామానాయుడు

10. ఎన్‌.ఎమ్‌.డి ఫరూక్‌

11. ఆనం రామనారాయణరెడ్డి

12. పయ్యావుల కేశవ్‌

13. అనగాని సత్యప్రసాద్‌

14. కొలుసు పార్థసారథి

15. డోలా బాలవీరాంజనేయస్వామి

16. గొట్టిపాటి రవి

17. కందుల దుర్గేష్‌

18. గుమ్మడి సంధ్యారాణి

19. బీసీ జనార్దన్‌రెడ్డి

20. టీజీ భరత్‌

21. ఎస్‌.సవిత

22. వాసంశెట్టి సుభాష్‌

23. కొండపల్లి శ్రీనివాస్‌

24. మండిపల్లి రామ్‌ప్రసాద్‌ రెడ్డి  

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని