ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు

ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది.

Updated : 07 Jun 2024 16:23 IST

హైదరాబాద్‌: ఏపీ బేవరేజెస్‌ కార్పొరేషన్‌ మాజీ ఎండీ వాసుదేవరెడ్డి నివాసంలో సీఐడీ సోదాలు నిర్వహించింది. హైదరాబాద్‌లోని నానక్‌రామ్‌గూడలో ఉదయం నుంచి వివిధ పత్రాలను అధికారులు తనిఖీ చేస్తున్నారు. జగన్‌ హయాంలో మద్యం దోపిడీ పర్వాన్ని వాసుదేవరెడ్డి ముందుండి నడిపించారనే ఆరోపణలు ఆయనపై ఉన్నాయి. వైకాపా అధికారంలో ఉన్న సమయంలో కరడుగట్టిన మద్దతుదారుగా పనిచేశారు. నూతన మద్యం విధానం పేరుతో ఆ పార్టీకి అనుచిత లబ్ధి చేకూరేలా భారీ ఎత్తున మద్యం సరఫరా చేశారని ఫిర్యాదులు అందాయి. ప్రభుత్వ మద్యం దుకాణాల్లో జే బ్రాండ్ తీసుకురావడంలో వాసుదేవరెడ్డి కీలక పాత్ర పోషించారు. దీనిపై ఫిర్యాదుల నేపథ్యంలోనే సీఐడీ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని