AP Cabinet: ఆంధ్రప్రదేశ్‌ మంత్రివర్గ సమావేశం వాయిదా

డిసెంబరు 11న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. 

Updated : 08 Dec 2023 19:01 IST

అమరావతి: డిసెంబరు 11న జరగాల్సిన ఏపీ మంత్రివర్గ సమావేశం వాయిదా పడింది. ఈనెల 14వ తేదీకి కేబినెట్‌ సమావేశం వాయిదా వేస్తూ సీఎస్‌ కార్యాలయం నోట్‌ విడుదల చేసింది. డిసెంబరు 14న ఉదయం 11గంటలకు సీఎం జగన్‌ అధ్యక్షతన మంత్రిమండలి భేటీ అవుతుందని ఉత్తర్వుల్లో స్పష్టం చేశారు. 12వ తేదీ సాయంత్రం 4గంటల్లోగా ప్రతిపాదిత అంశాలు పంపించాలని ఆయా శాఖల కార్యదర్శులను సీఎస్‌ కార్యాలయం ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు