mukesh kumar meena: రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలు: ముకేశ్‌కుమార్‌ మీనా

పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్‌ నాటికి రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను రప్పిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు.

Published : 27 May 2024 19:06 IST

గుంటూరు: పోలింగ్ అనంతరం జరిగిన అల్లర్లు, దాడులను దృష్టిలో ఉంచుకొని కౌంటింగ్‌ నాటికి రాష్ట్రానికి 20 కంపెనీల బలగాలను రప్పిస్తున్నట్లు ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేశ్‌కుమార్‌ మీనా తెలిపారు. కౌంటింగ్ రోజు, ఆ తర్వాత కూడా ఎలాంటి ఘర్షణలు చోటు చేసుకోకుండా పటిష్ఠ భద్రత ఏర్పాట్లు చేశామన్నారు. నాగార్జున యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌ రూమ్‌లను సోమవారం ఆయన పరిశీలించారు. మూడంచెల భద్రత వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. స్ట్రాంగ్‌ రూమ్‌ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. అభ్యర్థులు, ఏజెంట్లు భౌతికంగా రెండు పర్యాయాలు స్ట్రాంగ్‌ రూమ్‌లను పరిశీలించే అవకాశం కల్పించినట్లు చెప్పారు. పల్నాడులో పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, కేవలం పోలింగ్‌ తర్వాత మాత్రమే అల్లర్లు జరిగాయని తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ప్రశాంతంగా కౌంటింగ్‌ నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశామన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని