Jawahar Reddy: రాష్ట్రంలోని సమ్మర్‌ స్టోరేజీ ట్యాంకులను నింపండి: ఏపీ సీఎస్‌ ఆదేశం

రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 తేదీ వరకు నాగర్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు.

Published : 22 Apr 2024 21:57 IST

అమరావతి: రాష్ట్రవ్యాప్తంగా ఈ నెల 29 తేదీ వరకు నాగర్జున సాగర్ నుంచి నీటి విడుదల కొనసాగుతుందని ఏపీ సీఎస్ జవహర్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రకాశం బ్యారేజి నుంచి ఈ నెల 25 తేదీ వరకు కాల్వల ద్వారా నీటిని విడుదల చేస్తామన్నారు. వివిధ శాఖల అధికారులతో ఆయన సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని సమ్మర్ స్టోరేజీ ట్యాంకులను నింపాలని ఆదేశించారు. నీటి ఎద్దడి ఉన్న ప్రాంతాలకు ట్యాంకుల ద్వారా నీటిని సరఫరా చేయాలన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 1046 సమ్మర్ స్టోరేజీ ట్యాంకులకు గానూ ఇప్పటి వరకూ 680కి పైగా చెరువులను నింపినట్లు అధికారులు తెలిపారు.

రాష్ట్రంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా జాగ్రత్త పడాలని సీఎస్‌ సూచించారు. వేసవి తీవ్రత దృష్ట్యా వీలైనంత వరకు కోతలు లేకుండా ఉత్పత్తి, సరఫరా చేయాలన్నారు. ప్రస్తుతం రాష్ట్రంలో 245 మిలియన్ యూనిట్ల మేర విద్యుత్‌ డిమాండ్ ఉంటుందని అంచనా వేస్తున్నామని అధికారులు తెలిపారు. మే నెలలో 236 మిలియన్ యూనిట్లు, జూన్‌లో 253 మిలియన్ యూనిట్ల మేర గరిష్ఠ డిమాండ్‌ ఉండొచ్చని సీఎస్‌కు వివరించారు. డిమాండ్‌కు అనుగుణంగానే సరఫరా చేస్తున్నట్టు చెప్పారు. మరోవైపు కనీస మద్దతు ధరకు రబీ ధాన్యాన్ని కొనుగోలు చేసేందుకు చర్యలు చేపట్టాల్సిందిగా సీఎస్ జవహర్ రెడ్డి వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని