Polavaram: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరింది: కేంద్రం

పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరిన విషయాన్ని కేంద్రం వెల్లడించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు తొలిదశ నిర్మాణం పూర్తికి నిధులు కోరిందని జలశక్తిశాఖ పేర్కొంది.

Updated : 04 Dec 2023 23:26 IST

దిల్లీ: పోలవరం ప్రాజెక్టుకు ఏపీ ప్రభుత్వం నిధులు కోరిందని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. 41.15 మీటర్ల ఎత్తు వరకు తొలిదశ నిర్మాణం పూర్తికి నిధులు కోరిందని జలశక్తిశాఖ పేర్కొంది. రాజ్యసభలో తెదేపా ఎంపీ కనకమేడల రవీంద్రకుమార్‌ ప్రశ్నకు కేంద్ర జలశక్తిశాఖ సహాయ మంత్రి బిశ్వేశ్వర్‌ టుడు ఈ మేరకు లిఖితపూర్వక జవాబిచ్చారు. జూన్‌ 5న రూ.17,144 కోట్లు, ఆగస్టు 2న రూ.19,517 కోట్లు ఇవ్వాలని ఏపీ ప్రభుత్వం కోరింది. సవరించిన అంచనాల మేరకు రూ.19,517 కోట్లు నిధులు కోరిందని కేంద్రమంత్రి తెలిపారు. బ్యాలెన్స్‌ హెడ్‌వర్స్క్‌ కోసం రూ.10,022 కోట్లు, ఎడమ ప్రధాన కాలువ బ్యాలెన్స్‌ పనులకు రూ.1,225 కోట్లు, కుడి ప్రధాన కాలువ బ్యాలెన్స్‌ పనులకు రూ.412 కోట్లు, భూసేకరణ, పునరావాస పనులకు రూ.7,856 కోట్లు  కోరినట్లు కేంద్రమంత్రి టుడు తెలిపారు. సవరించిన అంచనాల ప్రతిపాదనలను పరిశీలన చేసి కేంద్రానికి పంపాలని జలశక్తి మంత్రిత్వ శాఖ అధికారులను ఆదేశించినట్లు మంత్రి పేర్కొన్నారు.  సవరించిన అంచనాలను పరిశీలించి, నివేదిక ఇస్తామని జలశక్తిశాఖ తెలిపింది. నివేదిక ఇచ్చేందుకు రివైజ్డ్‌ కాస్ట్‌ కమిటీ ఏర్పాటు చేశామని జలశక్తిశాఖ పేర్కొంది. 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని