AP High Court: టెట్‌, డీఎస్సీ షెడ్యూల్‌పై హైకోర్టులో విచారణ.. కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశం

టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది.

Published : 23 Feb 2024 16:25 IST

అమరావతి: టెట్‌, డీఎస్సీ పరీక్షల మధ్య సమయం ఉండేలా చూడాలన్న పిటిషన్‌పై శుక్రవారం ఏపీ హైకోర్టులో విచారణ జరిగింది. షెడ్యూల్‌ మార్చాలన్న పిటిషన్‌పై మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. దీనిపై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. తుది విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. పరీక్షల మధ్య సమయం ఉండేలా ఆదేశించాలని కొందరు అభ్యర్థులు హైకోర్టులో పిటిషన్‌ వేసిన విషయం తెలిసిందే. 

టెట్‌, డీఎస్సీ పరీక్షలకు కనీసం నెల రోజుల వ్యవధి ఇవ్వడం సముచితమని హైకోర్టు ఇటీవల ప్రాథమికంగా అభిప్రాయపడింది. షెడ్యూల్‌లో మార్పులు చేసే ఆలోచన ఏమైనా ఉందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించింది. సంతృప్తికర సమాధానం రాకపోవడంతో తగిన ఉత్తర్వులు జారీ చేస్తామంటూ విచారణను వాయిదా వేసిన విషయం తెలిసిందే. తాజాగా విచారించిన న్యాయస్థానం కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు