AP High Court: శిరోముండనం కేసు.. నిందితుల క్వాష్‌ పిటిషన్‌ కొట్టివేత

తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది.

Published : 01 Feb 2024 14:03 IST

అమరావతి: తూర్పుగోదావరి జిల్లా సీతానగరం పీఎస్‌ పరిధిలోని శిరోముండనం కేసులో హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. నిందితులు దాఖలు చేసిన క్వాష్‌ పిటిషన్‌ను కొట్టివేసింది. ఈ మేరకు ఉన్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. గతంలో విచారణపై ఇచ్చిన స్టేను కూడా ఎత్తివేసింది. 

ఇసుక రవాణాను అడ్డుకున్నాడంటూ ప్రసాద్‌ అనే వ్యక్తికి శిరోముండనం చేశారు. నిందితులపై పోలీసులు కేసు నమోదు చేశారు. దీనిపై వారు హైకోర్టులో క్వాష్‌ పిటిషన్‌ దాఖలు చేస్తూ కేసును కొట్టివేయాలని కోరారు. విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. ఆ పిటిషన్‌ను కొట్టివేస్తూ తాజాగా నిర్ణయం తీసుకుంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని