Vizag steelplant: విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ.. ఏపీ హైకోర్టు కీలక ఆదేశం
విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది.
అమరావతి: విశాఖ ఉక్కు కర్మాగారానికి చెందిన భూములు, ఆస్తుల విషయంలో యథాతథ స్థితి పాటించాలని కేంద్ర ప్రభుత్వాన్ని ఏపీ హైకోర్టు ఆదేశించింది. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ అంశంలో కేంద్ర క్యాబినెట్ తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్, విశ్రాంత ఐపీఎస్ అధికారి వీవీ లక్ష్మీనారాయణ తదితరులు దాఖలు చేసిన వ్యాజ్యాలపై హైకోర్టు గురువారం విచారణ చేపట్టింది.
స్టీల్ ప్లాంట్‌కు చెందిన భూములు, యంత్రాలు, ఇతర ఆస్తులను విక్రయించబోమంటూ అదనపు సొలిసిటర్ జనరల్ (ఏఎస్జీ) నరసింహశర్మ చెప్పిన వివరాలను కోర్టు నమోదు చేసుకుంది. కర్మాగారంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన 100శాతం పెట్టుబడులను మాత్రమే ఉపసంహరిస్తున్నామని ఏఎస్జీ కోర్టుకు తెలిపారు. కౌంటర్ వేసేందుకు సమయం కోరారు. తదుపరి విచారణను న్యాయస్థానం జూన్ 19కి వాయిదా వేసింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు. -
ఆమెకు క్యాబ్ ఖర్చే ₹16 వేలట.. మరి కారే కొనుక్కోవచ్చుగా..!
Viral news: బెంగళూరులో ఓ యువతి నెల రోజుల్లోనే రూ.16 వేలు క్యాబ్ బిల్లు చెల్లించింది. సోషల్‌మీడియాలో ప్రస్తుతం దీనికి సంబంధించిన పోస్ట్ వైరల్‌గా మారింది.
తాజా వార్తలు (Latest News)
-
గంజాయి మత్తులో దించి అత్యాచారానికి పాల్పడి.. సహకరించిన భార్య
-
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (27/07/24)
-
పావలా శ్యామలకు సాయిధరమ్ తేజ్ ఆర్థిక సాయం.. కన్నీరుపెట్టుకున్న నటి
-
మరింత తగ్గిన పసిడి ధర.. మీ నగరంలో ఎంతంటే?
-
ఇటలీలో పూజాహెగ్డే.. జిమ్‌లో రకుల్‌ప్రీత్.. సంయుక్త స్మైలీ సెల్ఫీ!
-
కొత్త హెడ్‌కోచ్‌గా ఆర్సీబీ మాజీ బ్యాటర్..! పంజాబ్ తలరాత మారేనా?