AB Venkateswara Rao: ఏబీ వెంకటేశ్వరరావుకు హైకోర్టులో ఊరట
సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది.
అమరావతి: సీనియర్ ఐపీఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు (ఏబీవీ)కు హైకోర్టులో ఊరట లభించింది. కేంద్ర పరిపాలన ట్రైబ్యునల్ (క్యాట్) ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించింది. ఏబీవీ సస్పెన్షన్‌ను ఎత్తివేస్తూ ఇటీవల క్యాట్ ఉత్తర్వులు ఇచ్చింది. ఆ ఉత్తర్వులను నిలుపుదల చేయాలంటూ రాష్ట్ర ప్రభుత్వం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరిస్తూ ప్రభుత్వ అప్పీల్‌ను కొట్టివేసింది.
రక్షణ పరికరాల కొనుగోలు వ్యవహారంలో అక్రమాలు జరిగాయన్న ఆరోపణలతో వైకాపా ప్రభుత్వం ఏబీ వెంకటేశ్వరరావును సస్పెండ్ చేసింది. ఆ తర్వాత ఆయన క్యాట్‌ను ఆశ్రయించిగా.. సస్పెన్షన్‌ను సమర్థించింది. అనంతరం ఆయన హైకోర్టుకు వెళ్లగా.. ఉన్నత న్యాయస్థానం సస్పెన్షన్‌ను కొట్టివేసింది. హైకోర్టు తీర్పును సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్లింది. సర్వీసులో ఉన్న అధికారిని రెండేళ్ల కంటే ఎక్కువ కాలం సస్పెన్షన్‌లో ఉంచొద్దని ఆదేశిస్తూ.. ఏబీ వెంకటేశ్వరరావుపై ఉన్న సస్పెన్షన్‌ను రద్దు చేసింది. సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాలకనుగుణంగా ఆయనకు రాష్ట్ర ప్రభుత్వం పోస్టింగ్ ఇచ్చింది. ఆ తర్వాత కొద్ది రోజులకే గతంలో ఏకారణంతో సస్పెండ్ చేశారో.. తిరిగి అదే కారణంతో మరోసారి ప్రభుత్వం సస్పెండ్ చేసింది.
ఒకే కారణంతో ప్రభుత్వం తనను రెండుసార్లు సస్పెండ్ చేయడాన్ని సవాల్ చేస్తూ ఏబీ వెంకటేశ్వరరావు క్యాట్‌ను ఆశ్రయించారు. సుదీర్ఘ విచారణ జరిపిన క్యాట్.. ఆయన సస్పెన్షన్‌ను రద్దు చేస్తూ నిర్ణయం తీసుకుంది. ఏబీవీకి వెంటనే పోస్టింగ్ ఇవ్వాలని.. సస్పెన్షన్ కాలానికి జీతభత్యాలు చెల్లించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. క్యాట్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత న్యాయస్థానంలో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన హైకోర్టు.. క్యాట్ ఉత్తర్వులను సస్పెండ్ చేసేందుకు నిరాకరించింది.
Trending
గమనిక: ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.
మరిన్ని
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం గడుపుతున్న వీరేంద్ర కుమార్‌ను మంత్రి నారా లోకేశ్ కాపాడారు. -
ఈనాడు.నెట్లో టాప్ 10 వార్తలు @ 9 AM
ఈనాడు.నెట్ లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం... -
బీమా సొమ్ము.. జీవితకాలం లేటు!
గుంటూరు నగర శివారులో పని చేసిన ప్రధానోపాధ్యాయుడొకరు రెండేళ్ల క్రితం స్వచ్ఛంద ఉద్యోగ విరమణ చేశారు. తనకు రావాల్సిన ప్రభుత్వ జీవిత బీమా (ఏపీజీఎల్ఐ) సొమ్ము కోసం ఏడాదిన్నర క్రితం దరఖాస్తు చేసుకున్నారు -
విమాన గోపురం.. సువర్ణశోభితం
అన్నవరం సత్యదేవుని ప్రధాన ఆలయంపైన ఉండే విమాన గోపురానికి బంగారు తాపడం చేయించేందుకు మరో కీలక అడుగుపడింది. దీనికి సంబంధించిన అంచనాలు సిద్ధం చేసేందుకు తితిదే సాంకేతిక బృందం నేడు ఇక్కడకు రానుంది. -
విశాఖ ప్రకృతిని కాపాడాల్సిన బాధ్యత అందరిదీ
‘విశాఖపట్నం ప్రకృతి అందాలకు నిలయం. ఇక్కడ కొండలు, గుట్టలు, నదులు, సముద్రం అన్నీ భగవత్ ప్రసాదాలే. -
అసలే పేదరికం.. ఆపై వైకల్యం
విధి వక్రించి ప్రమాదానికి గురయ్యాడు.. ప్రాణాలతో బయటపడినా చికిత్స కోసం అప్పులు చేయాల్సి వచ్చింది.. వైకల్యం బారిన పడటంతో పని చేయలేని స్థితి. -
అంధ బాలికపై అమానుషం.. వెల్లువెత్తిన నిరసన
అంధ బాలికపై అమానుషం ఘటనలో నిందితుడిని మలక్‌పేట ఠాణా పోలీసులు గురువారం అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. -
నేటి రాశి ఫలాలు.. 12 రాశుల ఫలితాలు ఇలా... (26/07/24)
ఈ రోజు ఏ రాశి వారికి ఎలాంటి ఫలితం ఉంటుంది. డాక్టర్ శంకరమంచి శివసాయి శ్రీనివాస్ అందించిన నేటి రాశి ఫలాల వివరాలు.
![ap-districts](https://assets.eenadu.net/_assets/_images/ap-districts.jpg)
![ts-districts](https://assets.eenadu.net/_assets/_images/ts-districts.jpg)
తాజా వార్తలు (Latest News)
-
అంత డబ్బు నా వద్ద లేదు: జాన్వీకపూర్
-
జేడీ వాన్స్ వ్యాఖ్యలు వైరల్.. తీవ్రంగా ఖండించిన ప్రముఖ నటి
-
మా బంధం ఎంతో స్పెషల్: కొత్త కోచ్ గంభీర్‌పై స్కై వ్యాఖ్యలు
-
సౌదీ అరేబియాలో దుర్భర జీవితం.. బాధితుడిని కాపాడిన మంత్రి లోకేశ్
-
అగ్నిపథ్ పథకంపై విపక్షాల విమర్శలు.. ఖండించిన మోదీ
-
మెక్సికన్ డ్రగ్ లార్డ్ ఇస్మాయిల్ ‘ఎల్ మాయో’ జంబాడ అరెస్ట్