AP High Court: మార్గదర్శి బ్రాంచ్‌లకు పోలీసు నోటీసులు.. సస్పెండ్‌ చేసిన హైకోర్టు

మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు చెందిన 3 బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలన్న పోలీసు నోటీసులను హైకోర్టు సస్పెండ్‌ చేసింది.

Updated : 19 Oct 2023 13:42 IST

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో చుక్కెదురైంది. మార్గదర్శి చిట్‌ఫండ్‌ సంస్థకు చెందిన 3 బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలన్న పోలీసు నోటీసులను ఉన్నత న్యాయస్థానం సస్పెండ్‌ చేసింది. చీరాల, విశాఖ, సీతంపేట బ్రాంచ్‌ల బ్యాంకు ఖాతాలను ఫ్రీజ్‌ చేయాలంటూ మార్గదర్శి బ్రాంచ్‌ మేనేజర్లకు పోలీసులు నోటీసులు ఇచ్చారు. పోలీసు నోటీసులను మేనేజర్లు హైకోర్టులో సవాల్‌ చేశారు. దీనిపై విచారణ చేపట్టిన ఉన్నత న్యాయస్థానం.. పోలీసుల నోటీసులను సస్పెండ్‌ చేసింది.


Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని