Andhra news: అధికార పార్టీ నేతల ఒత్తిళ్లు.. సెలవివ్వండి: ఈసీకి రిటర్నింగ్‌ అధికారుల విజ్ఞప్తులు

ఎన్నికల అనంతరం అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు రిటర్నింగ్‌ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారు.

Updated : 22 May 2024 15:41 IST

అమరావతి: ఎన్నికల అనంతరం అధికార పార్టీ అభ్యర్థుల ఒత్తిళ్లు తట్టుకోలేక పలువురు రిటర్నింగ్‌ అధికారులు ఈసీని సెలవులు అడుగుతున్నారు. ఈ విషయమై కొన్ని జిల్లాల నుంచి ఈసీకి విజ్ఞప్తులు అందుతున్నాయి. పోలింగ్ సమయం నుంచే ఈసీకి విజ్ఞప్తులు వెల్లువెత్తుతున్నాయి. అధికార పార్టీకి చెందిన అభ్యర్థుల అసభ్యకరమైన మాటలు వినలేకపోతున్నామని కొందరు అధికారులు ఈసీకి ఫిర్యాదు చేశారు. కౌంటింగ్ వరకు విధులు నిర్వహించే పరిస్థితి లేదంటూ ఈసీకి మొరపెట్టుకున్నారు. ఆర్వో బాధ్యతల నుంచి తమను తప్పించాలంటూ వేడుకున్నారు. ప్రత్యేకించి రాయలసీమ జిల్లాల నుంచి ఆర్వోలపై అధికార పార్టీకి చెందిన నేతల ఒత్తిళ్లు ఎక్కువయ్యాయి. వారి బెదిరింపులతో భయంభయంగానే విధులకు హాజరవుతున్నారు. ఆ స్థాయి ఒత్తిడిని తట్టుకోవడం మా వల్ల కాదని చేతులెత్తేస్తున్నారు. కేవలం ఐఏఎస్‌ స్థాయి అధికారులు మాత్రమే ఆ ఒత్తిడి తట్టుకోగలరని ఈసీకి నివేదిస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని