APSRTC: పరీక్ష లేదు.. ఏపీఎస్ ఆర్టీసీలో 309 అప్రెంటిస్ ఖాళీలు.. పూర్తి వివరాలివే..

ఏపీ ఆర్టీసీలో 309 అప్రెంటిస్‌ ఖాళీల భర్తీకి నోటిఫికేషన్‌ విడుదలైంది. 

Published : 31 Oct 2023 19:55 IST

ఇంటర్నెట్ డెస్క్‌: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (APSTRC)లో అప్రెంటిస్‌ శిక్షణకు నోటిఫికేషన్‌ వెలువడింది. నెల్లూరు జోన్ పరిధిలో వివిధ ట్రేడుల్లో శిక్షణకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఐటీఐ పూర్తి చేసిన వారు నవంబర్‌ 1 నుంచి 15లోగా ఆన్‌లైన్‌ https://www.apprenticeshipindia.gov.in/లో దరఖాస్తు చేసుకోవాలని ఆర్టీసీ సూచించింది. అర్హులైన అభ్యర్థులు కర్నూలులోని ఆర్టీసీ జోనల్‌ స్టాఫ్‌ ట్రైనింగ్‌ కళాశాలలో ధ్రువపత్రాల పరిశీలనకు హాజరుకావాల్సి ఉంటుందని ఓ ప్రకటనలో పేర్కొంది. 

ప్రకటనలోని ముఖ్యాంశాలివే..

  • కర్నూలు జోన్ పరిధిలోని మొత్తం 309 అప్రెంటిస్‌ ట్రైనింగ్‌కు ఖాళీలు ఉండగా.. జిల్లాల వారీగా కర్నూలు (49), నంద్యాల (50), అనంతపురం (52), శ్రీసత్యసాయి (40), కడప (67), అన్నమయ్య (51) చొప్పున భర్తీ చేస్తారు.
  • ట్రేడ్‌లు ఇవే.. డీజిల్‌ మెకానిక్‌, మోటార్‌ మెకానిక్‌, ఎలక్ట్రీషియన్‌, వెల్డర్‌, పెయింటర్‌, మెషినిస్ట్‌, ఫిట్టర్‌, డ్రాఫ్ట్స్‌ మెన్‌ (సివిల్‌)
  • అర్హత: అభ్యర్థి సంబంధిత ట్రేడ్‌లో ఐటీఐ ఉత్తీర్ణులై ఉండాలి.
  • ఎంపిక విధానం: విద్యార్హతల్లో అభ్యర్థులు సాధించిన మార్కుల, ఇంటర్వ్యూ, రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్‌ తదితరాల అధారంగా ఎంపిక చేస్తారు.
  • సర్టిఫికెట్ వెరిఫికేషన్ ఫీజు: రూ.118. వెరిఫికేషన్‌ తేదీని దినపత్రికల ద్వారా తెలియజేస్తారు. ఆన్‌లైన్‌ దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు మాత్రమే వెరిఫికేషన్‌కు హాజరుకావాలని జోనల్‌ సిబ్బంది శిక్షణ కళాశాల ప్రిన్సిపాల్‌ నజీర్‌ అహ్మద్‌ కోరారు.
Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని