Andhra news: మరోమారు చర్చలు విఫలం.. ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేసిన నెట్‌వర్క్‌ ఆసుపత్రులు

నెట్‌వర్క్‌ ఆసుపత్రులకు నిధులు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ వెల్లడించింది.

Updated : 22 May 2024 20:40 IST

అమరావతి: ఆరోగ్యశ్రీ సీఈవోతో ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రులు జరిపిన చర్చలు మరోమారు విఫలమయ్యాయని ఏపీ స్పెషాలిటీ ఆసుపత్రుల అసోసియేషన్‌ తెలిపింది. బుధవారం సాయంత్రం 3 నుంచి 4గంటల వరకు జూమ్‌ యాప్‌ ద్వారా ప్రభుత్వంతో చర్చలు జరిగాయి. రెండోసారి జరిపిన చర్చలు కూడా అసంపూర్తిగా ముగిశాయి. ఆరోగ్యశ్రీ సీఈవో రూ.203 కోట్లు విడుదల చేస్తామని తెలిపారు. మరో వైపు రూ.800 కోట్ల బకాయిలు విడుదల చేయాలని నెట్‌వర్క్‌ ఆసుపత్రులు కోరాయి. మొత్తం రూ.1500 కోట్ల బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయి. నిధులు మంజూరు చేసే వరకు ప్రైవేటు నెట్‌వర్క్‌ ఆసుపత్రుల్లో ఆరోగ్యశ్రీ సేవల బంద్‌ కొనసాగిస్తున్నట్టు ఆసోసియేషన్‌ తెలిపింది. మరో వైపు తాము రూ.203 కోట్ల బకాయిలు విడుదల చేసినట్టు ఆరోగ్యశ్రీ ట్రస్ట్‌ సీఈవో తెలిపారు. మిగిలిన బకాయిలను కూడా త్వరలోనే విడుదల చేస్తామన్నారు. రోగులకు ఆరోగ్యశ్రీ సేవలు అందేలా చూడాలని జిల్లా కలెక్టర్లను ఆదేశించామన్నారు.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని