Alluri: అల్లూరి జిల్లాలో వరద ముంపు.. బిక్కుబిక్కుమంటున్న 40 గ్రామల ప్రజలు

అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 40 గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. 

Updated : 29 Jul 2023 13:37 IST

వరరామ చంద్రాపురం: అల్లూరి సీతారామరాజు జిల్లాలో దాదాపు 40 గిరిజన గ్రామాలు వరద ముంపునకు గురయ్యాయి. ప్రధానంగా శ్రీరామగిరి, తుమ్మిళేరు, పోతవరం, జీడిగుప్ప, చినమట్టపల్లి పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో 300కు పైగా ఇళ్లు పూర్తిగా నీట మునిగాయి. ఇవన్నీ మారుమూల గ్రామాలు కావడం, ప్రత్యేక పునరావాస కేంద్రాలు లేకపోవటంతో.. వరద బాధితులంతా సమీప కొండ ప్రాంతాల్లో గుడారాలు వేసుకొని నాలుగు రోజులుగా బిక్కుబిక్కుమంటూ జీవనం వెళ్లదీస్తున్నారు. 

ఇక్కడ విద్యుత్‌ సరఫరా లేవకపోవడం, అపరిశుభ్ర వాతావరణంతో.. బాలింతలు, వృద్ధులు, వికలాంగుల బాధలు వర్ణనాతీతంగా ఉన్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నుంచి కిలో కందిపప్పు మినహ ఏ సహాయం అందలేదని గ్రామస్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని