Hyderabad: శ్రీరామ నవమి శోభాయాత్ర.. హైదరాబాద్‌లో పలు చోట్ల ట్రాఫిక్‌ ఆంక్షలు

శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్‌  సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది.

Published : 17 Apr 2024 11:57 IST

హైదరాబాద్‌: శ్రీరామనవమి సందర్భంగా జంట నగరాల్లో శోభాయాత్రకు ఏర్పాట్లు చేశారు. ధూల్‌పేట్‌ సీతారాంబాగ్‌ నుంచి కోఠి హనుమాన్‌ వ్యాయామశాల వరకు యాత్ర సాగనుంది. ఈ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు విధించారు. వెయ్యి మంది పోలీసులతో భద్రత కల్పించారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా చర్యలు తీసుకుంటున్నారు.

భాగ్యనగర్‌ శ్రీరామనవమి ఉత్సవ సమితి ఆధ్వర్యంలో భవ్య శోభాయాత్రకు ఏర్పాట్లు పూర్తి చేశారు. శాంతిభద్రతలకు భంగం కలగకుండా పోలీసులు సూచించిన మార్గంలోనే యాత్ర నిర్వహించాలని హైకోర్టు మంగళవారం స్పష్టం చేసింది. గోషామహల్‌, సుల్తాన్‌బజార్‌ ఠాణాల పరిధిలోని పలు ప్రాంతాల్లో రాత్రి 11.30 గంటలకు వరకు అవసరం మేరకు ట్రాఫిక్‌ మళ్లిస్తామని నగర పోలీసు కమిషనర్‌ తెలిపారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని