Hyderabad: సీఎం ప్రమాణస్వీకారానికి ఎల్బీ స్టేడియంలో కొనసాగుతున్న ఏర్పాట్లు

తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

Published : 06 Dec 2023 11:35 IST

హైదరాబాద్‌: తెలంగాణ నూతన సీఎం ప్రమాణస్వీకారానికి ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. హైదరాబాద్‌లోని ఎల్బీ స్టేడియంలో గురువారం మధ్యాహ్నం 1.04 గంటలకు రేవంత్‌రెడ్డి సీఎంగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఈ నేపథ్యంలో అక్కడ జరుగుతున్న ఏర్పాట్లను సీఎస్‌ శాంతికుమారి, డీజీపీ రవిగుప్తా, ఇతర శాఖల ఉన్నతాధికారులు పరిశీలించారు. చేస్తున్న ఏర్పాట్లు, బందోబస్తు తదితర అంశాలపై డీజీపీ, జీహెచ్‌ఎంసీ ఉన్నతాధికారులను సీఎస్‌ అడిగి తెలుసుకున్నారు. 

మరోవైపు ప్రమాణ స్వీకార కార్యక్రమం నిర్వహణ, ఏర్పాట్లపై ఎల్బీ స్టేడియంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. కాంగ్రెస్‌ నేతలతో పోలీసు, సాధారణ పరిపాలన శాఖ అధికారులు చర్చించారు. సీఎల్పీ నేతగా ఎంపికైన రేవంత్‌రెడ్డి గురువారం రాష్ట్ర నూతన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని