Ts High court: బండి సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్ పూర్తి.. విచారణ 20కి వాయిదా

మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్ పూర్తయింది.

Updated : 15 Sep 2023 18:34 IST

హైదరాబాద్‌: మంత్రి గంగుల కమలాకర్‌ ఎన్నిక వివాదంలో భాజపా నేత, ఎంపీ బండి సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్ పూర్తయింది. సంజయ్‌ క్రాస్‌ ఎగ్జామినేషన్‌ వాంగ్మూలాన్ని అడ్వొకేట్‌ కమిషనర్‌ నమోదు చేశారు. కరీంనగర్‌ ఎమ్మెల్యేగా గంగుల కమలాకర్‌ ఎన్నికను కొట్టివేసి.. తనను ప్రకటించాలని కోరుతూ బండి సంజయ్‌ 2019లో హైకోర్టులో పిటిషన్‌ వేశారు. సాక్షుల విచారణ, ఆధారాల పరిశీలన కోసం విశ్రాంత జిల్లా జడ్జిని అడ్వొకేట్‌ కమిషనర్‌గా హైకోర్టు నియమించింది. 

అడ్వొకేట్ కమిషనర్ ఎదుట బండి సంజయ్ గతంలో హాజరై వివరాలు సమర్పించి, వాంగ్మూలం ఇచ్చారు. పిటిషనర్‌ను క్రాస్ ఎగ్జామినేషన్ చేయాలని గంగుల కమలాకర్ తరఫు న్యాయవాది కోరడంతో అడ్వొకేట్ కమిషనర్ అంగీకరించారు. పార్లమెంటు సమావేశాలు, వ్యక్తిగత పనులు, అమెరికా పర్యటన తదితర కారణాలతో క్రాస్ ఎగ్జామినేషన్‌కు పలుమార్లు వాయిదా కోరడంతో ఇటీవల అసహనం వ్యక్తం చేసిన హైకోర్టు.. సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించాలని బండి సంజయ్‌ని ఆదేశించింది. హైకోర్టు ఆదేశాల మేరకు సైనిక సంక్షేమ నిధికి రూ.50వేలు చెల్లించిన సంజయ్.. క్రాస్ ఎగ్జామినేషన్ పూర్తి చేశారు. గంగుల కమలాకర్ ఎన్నిక వివాదంపై విచారణ సెప్టెంబరు 20న జరగనుంది

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని