Kanipakam: కాణిపాకం హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం

చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం ప్రదర్శించాడు.

Published : 30 May 2024 12:47 IST

కాణిపాకం: చిత్తూరు జిల్లా కాణిపాకం స్వయంభూ శ్రీవరసిద్ధి వినాయక స్వామివారి ఆలయ హుండీల లెక్కింపులో బ్యాంకు అప్రైజర్‌ చేతివాటం ప్రదర్శించాడు. భక్తులు స్వామివారికి సమర్పించిన బంగారం, వెండి తదితర కానుకలను ఆలయ ఆస్థాన మండపంలో గురువారం లెక్కించారు. ఈ క్రమంలో స్థానిక బ్యాంకుకు చెందిన అప్రైజర్‌ ప్రకాశ్‌.. ఈ లెక్కింపులో 100 గ్రాముల బంగారు బిస్కెట్‌ను తన సంచిలో దాచుకున్నాడు. విషయాన్ని గుర్తించిన ఆలయ ఈవో సీసీ కెమెరాలను పరిశీలించి చోరీని ధ్రువీకరించారు. అనంతరం బంగారు బిస్కెట్‌ను స్వాధీనం చేసుకుని అతడిని కాణిపాకం పోలీసులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు