Hyderabad: ప్రగతిభవన్‌ ముందు బారికేడ్లు, గ్రిల్స్‌ తొలగింపు

నగరంలోని ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో కార్మికులు బారికేడ్లను తీసివేస్తున్నారు.

Updated : 07 Dec 2023 12:31 IST

హైదరాబాద్‌: నగరంలోని ప్రగతిభవన్‌ ముందున్న బారికేడ్లను అధికారులు తొలగిస్తున్నారు. గ్యాస్‌ కట్టర్ల సాయంతో కార్మికులు బారికేడ్లను తీసివేస్తున్నారు. వీటితో పాటు అక్కడి రోడ్డు పక్కనే ఉన్న షెడ్‌, గ్రిల్స్‌ను తొలగిస్తున్నారు. రాష్ట్రంలో నూతన ప్రభుత్వం ఏర్పడనున్న నేపథ్యంలో అధికారులు ఈ చర్యలు చేపట్టడం గమనార్హం. మరికొద్దిసేపట్లో తెలంగాణ రెండో ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి ప్రమాణస్వీకారం చేయనున్న విషయం తెలిసిందే.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని