వినేద్దామా పుస్తకాలను..!

‘‘ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం’’ అంటారు. అందుకేనేమో గొప్పగొప్ప వాళ్లకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. కానీ నేటి యువత పుస్తకాలు చదవడమంటేనే బోర్‌గా ఫీలవుతున్నారు.

Published : 15 Dec 2020 09:52 IST

ఇంటర్నెట్‌డెస్క్‌: ‘‘ఒక మంచి పుస్తకం వంద మంది స్నేహితులతో సమానం’’ అంటారు. అందుకేనేమో గొప్పగొప్ప వాళ్లకి పుస్తకాలు చదవడం అంటే చాలా ఆసక్తి ఉంటుంది. కానీ నేటి యువత పుస్తకాలు చదవడమంటేనే బోర్‌గా ఫీలవుతున్నారు. ఇక ఈ మధ్య కరోనా పుణ్యమా అని చదువులన్నీ ఆన్‌లైన్‌ బాట పట్టిన వేళ.. స్మార్ట్‌ఫోన్లే తరగతి గదులయ్యాయి. అలాంటప్పుడు ప్రత్యేకించి నవలలు, పుస్తకాలు చదవడమంటే బాబోయ్‌ మా వల్ల కాదు అనేవాళ్లే ఎక్కువ. అందుకే ఈ తరం అభిరుచులను దృష్టిలో పెట్టుకుని ఇటీవల కొన్ని ఆన్‌లైన్‌ స్టోరీ వెబ్‌సైట్లు వెలిశాయి. కొన్ని సంస్థలు ఇంకాస్త ముందుకెళ్లి ‘ఆడియోబుక్స్‌’ కూడా అందుబాటులోకి తెచ్చాయి. అంటే పేజీలు తిరిగేసే పనిలేకుండా ఇయర్‌ఫోన్స్‌ పెట్టుకుని పుస్తకమంతా వినొచ్చన్న మాట. ఈ ఆడియోబుక్స్‌కు యువతలో మంచి క్రేజ్‌ ఏర్పడింది. మరి ఈ ఏడాది పాపులర్‌ అయిన ఆన్‌లైన్‌ బుక్‌ రిటైలర్స్‌ ఏంటో ఓసారి చూద్దామా..!

ఓవర్‌డ్రైవ్‌/లిబ్బి

ఆన్‌లైన్‌ లైబ్రరీ విభాగంలో అత్యంత పాపులర్‌ అయిన కంపెనీ ఓవర్‌డ్రైవ్‌. ఈ సంస్థ వెబ్‌సైట్‌లో లక్షకు పైగా ఆడియోబుక్స్‌ అందుబాటులో ఉన్నాయి. అయితే ఇందులో పుస్తకాలను డౌన్‌లోడ్‌ చేసుకోవాలంటే డిజిటల్‌ లైబ్రరీ కార్డు ఉండాలి. లేదంటే లిబ్బి యాప్‌ ద్వారా యాక్సెస్‌ పొందవచ్చు. 

హూప్లా

ఈ వెబ్‌సైట్‌లో దాదాపు 90వేల ఆడియోబుక్స్‌ ఉన్నాయి. హూప్లా యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకుని అందులోని పుస్తకాలను మీ స్మార్ట్‌ఫోన్‌లలో వినేయొచ్చు. 

లైబ్రివోక్స్‌

ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ ఆదరణ ఉన్న ఆడియోబుక్‌ సంస్థ లైబ్రివోక్స్‌. ఇందులో పుస్తకాలను ఉచితంగా వినేయొచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ప్రముఖ మీడియా సంస్థలు ఈ ఆన్‌లైన్‌ లైబ్రరీని తమ వెబ్‌సైట్లలో రెకమండ్‌ చేస్తున్నాయి. 

లాయల్‌ బుక్స్‌

లాయల్‌బుక్స్‌.కామ్‌లోని ఆడియోబుక్స్‌ పూర్తిగా పబ్లిక్ డొమైన్‌కు చెందినవి. అంటే ఇందులో ఏ పుస్తకానికి కాపీరైట్‌ ఉండదు. ఎవరైనా ఈ పుస్తకాన్ని ఉచితంగా చదవొచ్చు. ఇతరులకు కూడా షేర్‌ చేయవచ్చు.

ప్రాజెక్ట్‌ గుటెన్‌బర్గ్‌

డిజిటల్‌ లైబ్రరీ చరిత్రలో అత్యంత పాత ప్రాజెక్ట్‌ గుటెన్‌బర్గ్‌. 1971లో ఈ కంపెనీని ప్రారంభించినప్పటి నుంచి ఎన్నో పుస్తకాలను ఆర్కివ్‌ చేశారు. ఇందులో 60వేలకు పైగా ఈబుక్స్‌ను ఉచితంగా డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు. 

స్పాటిఫై

మనలో చాలా మందికి స్పాటిఫై అంటే మ్యూజిక్‌ యాప్‌గానే తెలుసు. అయితే ఇందులో ఎడమవైపు బ్రౌజ్‌ అనే బటన్‌ను క్లిక్‌ చేస్తే అందులో word ఆప్షన్‌ వస్తుంది. దాన్ని క్లిక్‌ చేస్తే ఉచిత ఆడియోబుక్‌ కలెక్షన్‌ కన్పిస్తుంది. దీనికి కూడా ఎలాంటి సబ్‌స్క్రిప్షన్‌ అవసరం లేదు.

స్టోరీనరీ

ఇది ప్రత్యేకించి పిల్లల కోసం తీసుకొచ్చిన ఆన్‌లైన్‌ లైబ్రరీ. ఇందులో చందమామ, పంచతంత్ర లాంటి కథలు, పిల్లలు ఇష్టపడే పుస్తకాలు ఉన్నాయి. పెద్దవాళ్ల కోసం కూడా కొన్ని కథల పుస్తకాలు ఈ వెబ్‌సైట్లో అందుబాటులో ఉన్నాయి.

ఇవేగాక, ఆడిబుల్‌, స్క్రిబ్డ్‌, స్టోరీటెల్‌ లాంటి డిజిటల్‌ లైబ్రరీలు కూడా ఉన్నాయి. కొన్నింటికి కనీస రుసుములు ఛార్జ్‌ చేస్తుండగా.. కొన్ని ఉచిత సేవలు అందిస్తున్నాయి. మరింకెందుకు ఆలస్యం మీరు కూడా ఇక నుంచి పుస్తకాలను వినేయండి..! 

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు