Bhadrachalam: భద్రాద్రి రామాలయంలో అట్టహాసంగా రథోత్సవం

అయోధ్య శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం (Bhadrachalam) రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు.

Updated : 22 Jan 2024 10:36 IST

భద్రాచలం: అయోధ్యలో శ్రీరాముడి విగ్రహ ప్రాణప్రతిష్ఠ మహోత్సవాన్ని పురస్కరించుకొని భద్రాచలం (Bhadrachalam) రామాలయంలో ప్రత్యేక ఉత్సవాలను నిర్వహించారు. స్వామివారి పాదాల వద్ద స్వర్ణ పుష్పాలను ఉంచి అర్చన చేశారు. శ్రీరామ రథంతో పట్టణంలో రథయాత్ర చేపట్టారు. వేద మంత్రోచ్ఛరణ, మంగళవాయిద్యాలు, హరిదాసుల కీర్తనల మధ్య అఖిలాండ కోటి బ్రహ్మండ నాయకుడి రథయాత్ర కొనసాగింది. శోభాయాత్ర సందర్భంగా సాంస్కృతిక ప్రదర్శనలు ఏర్పాటు చేశారు. ‘జై శ్రీ రామ్‌’ నినాదాలతో కాషాయ జెండాలను ఊరేగించారు. దీంతో పట్టణంలో ఆధ్యాత్మిక శోభ నెలకొంది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని