Hyderabad: సంక్రాంతి రద్దీ.. కిటకిటలాడుతున్న బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు

సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. 

Published : 11 Jan 2024 22:00 IST

హైదరాబాద్‌: సంక్రాంతి సందర్భంగా సొంతూళ్లకు వెళ్లే ప్రయాణికులతో ఆర్టీసీ బస్టాండ్లు, రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. పాఠశాలలు, కళాశాలలకు సెలవులు ప్రకటించడంతో గురువారం నుంచి రద్దీ పెరిగింది. పండుగ నేపథ్యంలో టీఎస్‌ఆర్టీసీ 4,484 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. 626 సర్వీసులకు ముందస్తు రిజర్వేషన్‌ సౌకర్యం కల్పించింది. ప్రయాణికులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. మరో వైపు సికింద్రాబాద్‌, నాంపల్లి, కాచిగూడ రైల్వే స్టేషన్లు కిటకిటలాడుతున్నాయి. తెలంగాణలో మహాలక్ష్మి స్కీమ్‌ కింద ప్రత్యేక బస్సుల్లో కూడా ఉచిత ప్రయాణ సదుపాయం అమలు చేస్తుండటంతో మహిళల సంఖ్య భారీగా పెరిగింది.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని