Nagarjuna Sagar: సాగర్ వ్యవహారం.. తెలుగు రాష్ట్రాల మధ్య పోటాపోటీ కేసులు

నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Dam) వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటాపోటీగా కేసులు నమోదు అవుతున్నాయి.

Updated : 02 Dec 2023 14:51 IST

నాగార్జున సాగర్: నల్గొండ జిల్లా నాగార్జున సాగర్ ప్రాజెక్ట్ (Nagarjuna Sagar Dam) వ్యవహారంపై ఏపీ, తెలంగాణ రాష్ట్రాల మధ్య పోటాపోటీగా కేసులు నమోదు అవుతున్నాయి. తమపై దాడి చేసి సాగర్ డ్యామ్‌పైకి అక్రమంగా చొరబడ్డారని ఏపీ పోలీసులపై డ్యామ్ వద్ద సెక్యూరిటీగా ఉన్న తెలంగాణ సిబ్బంది ఫిర్యాదు చేశారు. అలాగే అనుమతి లేకుండా సాగర్ నీటిని విడుదల చేశారని ఏపీ ఇరిగేషన్ శాఖ అధికారులపై తెలంగాణ ఇరిగేషన్ శాఖ అధికారులు కంప్లైంట్ ఇచ్చారు. ఈ రెండు ఫిర్యాదులపై నాగార్జునసాగర్‌ పీఎస్‌లో కేసులు నమోదు అయ్యాయి.

ఇదిలా ఉండగానే, తాజాగా తెలంగాణ పోలీసులపై ఏపీ ఇరిగేషన్ అధికారులు ఫిర్యాదు చేశారు. సాగర్ డ్యామ్‌పై తమ విధులను అడ్డుకున్నారని విజయపురి సౌత్ పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ ఇచ్చారు. ఏపీ ఇరిగేషన్ అధికారుల ఫిర్యాదు మేరకు తెలంగాణ పోలీసులపై విజయపురి స్టేషన్‌లో పలు సెక్షన్ల కింద కేసు నమోదు అయ్యింది. కృష్ణా జలాల పంపకాల్లో రెండు రాష్ట్రాల మధ్య మరోసారి నెలకొన్న వివాదం నేపథ్యంలో.. ఇరు రాష్ట్రాల అధికారులు పోటాపోటీగా కేసులు పెట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని

ap-districts
ts-districts

సుఖీభవ

చదువు