MLC kavitha: అప్రూవర్ల వాంగ్మూలం ఆధారంగా కవితను ప్రశ్నించనున్న సీబీఐ

మద్యం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. భారాస ఎమ్మెల్సీ కవిత శని, ఆదివారాల్లో వారి కస్టడీలో ఉండనున్నారు.

Updated : 13 Apr 2024 15:29 IST

దిల్లీ: మద్యం కేసులో సీబీఐ విచారణ కొనసాగుతోంది. భారాస ఎమ్మెల్సీ కవిత శని, ఆదివారాల్లో వారి కస్టడీలో ఉండనున్నారు. కోర్టు ఆదేశాలతో శుక్రవారం సాయంత్రం కవితను అధికారులు సంస్థ కేంద్ర కార్యాలయానికి తరలించారు. దిల్లీ మద్యం విధానం రూపకల్పన, అక్రమాల్లో కవితను కీలక సూత్రధారి, పాత్రధారిగా కేంద్ర దర్యాప్తు సంస్థ పేర్కొంది. అప్రూవర్లుగా మారిన వారు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా ఆమెను అధికారులు ప్రశ్నించనున్నారు. తమ కస్టడీలో ఉన్న సమయంలో ప్రతి 48 గంటలకు వైద్య పరీక్షలు చేయించనున్నారు. రోజూ సాయంత్రం 6 నుంచి 7 గంటల మధ్య న్యాయవాది, కుటుంబ సభ్యులను కలిసేందుకు కవితకు కోర్టు అనుమతి ఇచ్చింది. ఆమె భర్త అనిల్, సోదరుడు కేటీఆర్, పీఏ శరత్, న్యాయవాది మోహిత్ రావును కలిసేందుకు అవకాశం కల్పించింది.


Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని