TS News: తెలంగాణకు ఐఐహెచ్‌టీ మంజూరు.. మంత్రి తుమ్మల హర్షం

తెలంగాణకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది.

Updated : 02 Mar 2024 22:20 IST

హైదరాబాద్‌: తెలంగాణకు ఇండియన్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ హ్యాండ్లూమ్స్‌ టెక్నాలజీ (ఐఐహెచ్‌టీ)ని కేంద్ర ప్రభుత్వం మంజూరు చేసింది. కేంద్ర జౌళి శాఖ కార్శదర్శి ఇటీవల హైదరాబాద్‌కు వచ్చిన సమయంలో మంత్రి తుమ్మల నాగేశ్వరరావు.. రాష్ట్రంలో ఐఐహెచ్‌టీని ఏర్పాటు చేయాలని ప్రతిపాదనలు సమర్పించారు. సీఎం రేవంత్‌రెడ్డి సైతం దిల్లీ పర్యటనలో కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌ను కోరారు. దీంతో ఐఐహెచ్‌టీ మంజూరు చేస్తూ కేంద్రం నిర్ణయం తీసుకుంది. దీనిపై మంత్రి తుమ్మల హర్షం వ్యక్తం చేశారు. ఐఐహెచ్‌టీతో జౌళి పరిశ్రమ అంతర్జాతీయ స్థాయికి చేరుతుందని తెలిపారు. ఇక్కడి విద్యార్థులు స్వరాష్ట్రంలోనే హ్యాండ్లూమ్స్‌ డిప్లొమా, డిగ్రీ వంటి కోర్సులు చదివే అవకాశం ఉంటుందని పేర్కొన్నారు.

Tags :

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని